Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతుంది. ఆమె ఆత్మహత్య చేసుకుందని, ఆసుపత్రిలో అడ్మిట్ అయిందని కలకలం రేపుతున్నాయి. ఈ వార్తలు చూసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. మొన్నటి వరకు బాగానే ఉన్న పూజా హెగ్డే ఆత్మహత్య చేసుకోవడమేంటని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పుకారు పుట్టించింది మరెవరో కాదు బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సైంధు . ఆయన ట్వీట్ లో పూజా హెగ్డే గత కొన్ని నెలల నుంచి డిప్రెషన్ కి గురైందని.. మరీ ముఖ్యంగా రెండు వారాల నుంచి తీవ్ర డిప్రెషన్ కి గురైందని అన్నాడు.
ఆమె తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఆత్మహత్య చేసేందుకు ప్రయత్నించింది అని..టైంకి తన పేరెంట్స్ గమనించి సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లారని ..దీంతో ప్రాణాపాయం తప్పిందని తన ట్వీట్లో పేర్కొన్నాడు. కొద్ది రోజులుగా ఉమైర్ సంధు తప్పుడు ట్వీట్స్ చేస్తూ అందరి అటెన్షన్ తనపై పడేలా చేస్తున్నాడు. పూజ హెగ్డే కనుక త్వరగా ఈ వార్తలపై స్పందించకపోతే పరిస్థితి మరింత చేజారిపోయే అవకాశం ఉంది అంటున్నారు ఆమె అభిమానులు. ఇటీవల ఉమైర్ .. అనన్య పాండే పట్ల కూడా దారుణమైన వ్యాఖ్యలు చేశారు.ఆమె ఓ హీరోతో విదేశాలకి వెళ్లి అక్కడ కడుపు కూడా చేయించుకునేలా ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఒకప్పుడు వరుస సినిమాలతో తెగ సందడి చేసిన పూజా హెగ్డే ఇప్పుడు కాస్త స్లో అయినట్టు కనిపిస్తుంది. వరుసగా బ్యాక్ టు బ్యాక్ నలుగురు స్టార్ హీరోలతో నాలుగు బడా డిజాస్టర్లను సొంతం చేసుకున్న పూజా హెగ్డేకి ఇప్పుడు ఒక్క అవకాశం కూడా లేదు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు సినిమా గుంటూరు కారంలో నటిస్తుంది అన్న ఆశలైనా ఉండేవి. కాని అది కూడా చేజారిపోయిందని సమాచారం. అయితే ఈ అమ్మడు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు బిజినెస్లు చేసిందని వాటితో పూజా బాగానే సంపాదిస్తుందని అంటున్నారు.