Saidharam: మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నారు. కెరీర్ సజావుగా సాగుతున్న సమయంలో తేజ్ ప్రమాదానికి కి గురయి చాలా తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ తర్వాత తేజ్ కొన్ని నెలలు చికిత్స తీసుకొని బయటకు రాకుండా, హాస్పిటల్, ఇంట్లోనే ఉన్నారు. మొత్తం రికవర్ అయ్యాకనే ఆయన బయటకు వచ్చారు. ఇటీవల విరూపాక్ష సినిమాతో పెద్ద హిట్ కూడా అందుకున్నారు. ఆ తర్వాత తన మావయ్యతో కలిసి బ్రో అనే సినిమాలో నటించగా, రీసెంట్గా ఈ చిత్రంతో పలకరించాడు. అయితే తన తదుపరి సినిమాకి తేజ్ కాస్త గ్యాప్ తీసుకోబోతున్నాడు.
అయితే సాయితేజ్‌కి ఇండస్ట్రీలో కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో ప్రముఖ సీనియర్ నటుడు నరేష్ కుమారుడైన నవీన్ ఒకరు. ఇతగాడు గతంలో కొన్ని సినిమాల్లో హీరోగాను నటించారు. రెండు జెళ్ల సీత, నందిని నర్సింగ్ హోమ్, ఊరంతా అనుకుంటున్నారు సినిమాల్లో నటించి ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేయగా, అవి పెద్దగా వర్కవుట్ కాలేదు. చాలా గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టుకున్న ఇతను సాయి తేజ్, స్వాతి కలర్స్ జంటగా ‘సోల్ ఆఫ్ సత్య’ పేరుతో ఒక షార్ట్ ఫిలిం రూపొందించగా, ఇటీవల దీనికి సంబంధించి విడుదలైన సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక దీనికి సంబంధించిన ప్రమోషన్స్‌లో పాల్గొంటూ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు నవీన్.
తాజా ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ నా జీవితంలో చాలా మార్పులు తెచ్చింది అని చెప్పుకొచ్చాడు. జీవితంలో ఎంత బాధ్యతగా ఉండాలనేది ఆ యాక్సిడెంట్ నేర్పించింది.‘ సాయి తేజ్ ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు నేనూ సాయి కలిసి బయటకు వెళ్లాం. తిరుగు ప్రయాణంలో నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి తన ఇంటికి బయలు దేరగా ఆ సమయంలో ప్రమాదం జరిగింది. అప్పుడు సాయికి యాక్సిడెంట్ అయింది అనుకుంటే చిన్న ప్రమాదం అనుకున్నా. కాని ఆసుపత్రికి వెళ్లి అక్కడి పరిస్థితి చూసి షాక్ అయ్యాను. అది నాకు చాలా పెద్ద పాఠం నేర్పింది. సాయి తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయడడం చూసి చాలా ఎమోషనల్ అయ్యా. నా ఫోన్ స్విచాఫ్ చేసుకున్నా, ఎవరిని కలవలేదు, బైక్స్ అన్నీ అమ్మేశాను అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు నవీన్.