Hero Surya Rs. Worked for a salary of 700? And movies?
Home Film News Suriya: హీరో సూర్య నెలకు రూ. 700 జీతం కోసం పనిచేశారా? మరి సినిమాలు?
Film News

Suriya: హీరో సూర్య నెలకు రూ. 700 జీతం కోసం పనిచేశారా? మరి సినిమాలు?

Suriya: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి ఎంతో గొప్ప స్టార్ డమ్ ను సంపాదించుకున్నారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ ఉండి సినీ ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకున్నవారు ఉన్నారు. ఈ క్రమంలో తమ టాలెంట్ తో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు, హార్డ్ వర్క్ చేస్తారు. అయితే సినీ ఇండస్ట్రీలో అభిమానుల మనసుల్ని గెలుచుకునే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. అలాంటి వాళ్లల్లో హీరో సూర్య కూడా ఒకరు. సూర్య కోలీవుడ్ స్టార్ హీరో అయినా కూడా తెలుగులో కూడా ఆయనకు ఎంతో క్రేజ్ ఉంది. ఆయన నటించిన గజిని సినిమా తెలుగులో క్రేజీ హిట్ ను అందుకుంది. అప్పట్నుండి సూర్యకు అభిమానులు విపరీతంగా ఉన్నారు.

సూర్య యాక్టింగ్ తో పాటు ఆయన చేసే మంచి పనులకు కూడా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నెక్ట్స్ సూర్య హీరోగా వచ్చిన సెవెన్త్ సెన్స్ మూవీ కూడా తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. రీసెంట్ గా జై భీమ్ మూవీతో సూర్య మరింత ఫేమ్ దక్కించుకున్నారు. అంతేనా.. ఆకాశమే నీ హద్దురా సినిమాకు కూడా ఎంతగానో ఆదరించారు తెలుగు అభిమానులు. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్ మూవీలో సూర్య స్పెషల్ రోల్ అంటే విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టింది. సూర్యతో పాటు ఆయన తమ్ముడు కార్తీకి కూడా తెలుగులో మంచి ఆదరణ ఉంది. ఆయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులోనూ మంచి హిట్ పాపులారిటీని దక్కించుకున్నాయి. సూర్య భార్య జ్యోతికకు కూడా తెలుగులో ఎంతో మంచి అభిమానం ఉంది.

 

ఇంతటి క్రేజ్ ఉన్న స్టార్ హీరో సూర్య తాను సినిమాల్లోకి రాకముందు ఓ ఉద్యోగం చేసేవారట. సూర్య నాన్న శివకుమార్ కు ఎన్నో ఆస్తులు ఉన్నా.. సూర్య తన కాళ్ల మీద తాను నిలబడాలనే ఇంట్రెస్ట్ ఉండేదట. అందుకే ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో నెలకు రూ. 736 జీతంతో పనిచేశారట. ఆ తర్వాత తన తండ్రి శివకుమార్ కోరిక కారణంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సూర్య తండ్రి కూడా సీరియల్స్ లో నటించి తెలుగులో మంచి పేరు సంపాదించుకున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...