సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. డైరెక్టర్ శంకర్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అటు తమిళ్ లోనే కాకుండా ఇటు తెలుగులో కూడా ఎంతో పెద్ద సక్సెస్ సాధించిన ఈ మూవీ అటు గ్రాఫిక్స్ విషయంలోనే కాక, ఇటు నటన విషయంలోనూ మంచి సత్తా ఉన్న సినిమాగా నిరూపించుకుంది. రజనీ కాంత్ ఒక్కసారిగా రోబో గా నటించడం ఎందరినో షాక్ కి గురి చేసింది.
అందాల ఐశ్వర్య రాయ్ ఈ మూవీ లో కథానాయికగా నటించడం మరో విశేషం. ఇందులో విలన్ పాత్రలో డ్యానీ కనిపించాడు. మూవీలో ఎంతో ముఖ్య పాత్ర పోషించిన ఈ పాత్రని పోషించడానికి ఒక పెద్ద హీరోనే సంప్రదించారట శంకర్. కానీ, ఆయన అనుకున్నట్టు పని జరగలేదు. ఆ పెద్ద హీరో ఈ పాత్రని చేయడానికి ఆసక్తి చూపించలేదట. ఇంతకీ ఆ పెద్ద హీరో ఎవరని అనుకుంటున్నారా..? అతనేవారో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు.
ఎందుకంటే, శంకర్ టీం ఈ పాత్ర కోసం ఎంచుకున్న వ్యక్తి ఏకంగా బాలీవుడ్ కింగ్ అమితాబ్ బచ్చన్. అలాంటి హీరో ఈ సినిమాలో విలన్ పాత్రలో చేయాలి అంటే ఖచ్చితంగా ఆలోచిస్తాడు కదా.. అది ఎంత పెద్ద సినిమా అయినా ఆయన ఒప్పుకుంటాడని ఆశించడం కాస్త దురాశే అవుతుంది. ఈ విషయంపై అమితాబ్ ఒకసారి మీడియా ముందు కూడా మాట్లాడారట. రజనీకాంత్ స్వయంగా తనకు కాల్ చేసి.. మీ లాంటి హీరో నా మూవీలో విలన్ గా నటిస్తే, అభిమానులు అస్సలు తీసుకోలేరని చెప్పినట్టు ఆయన మీడియాకి చెప్పాడు. ఇలాంటి పెద్ద సినిమాకి విలన్ కూడా ఎంత ముఖ్యమో శంకర్ కి బాగా తెలుసు కాబట్టి.. ఆయన అమితాబ్ ని సంప్రదించాడు. పెద్ద దర్శకులు ఇలా ఆలోచిస్తారు కాబట్టే.. రాజమౌళి బాహుబలిలో రానాని విలన్ గా తీసుకున్నాడు. ఇక బాహుబలి సక్సెస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం అస్సలు లేదు.
Leave a comment