Heroes-Heroines: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణించాలంటే ఎంతో మంచి పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉండాలి. అలాగే హీరోయిన్లు ఎన్నో ఆటంకాలను దాటుకుని మరీ సినీ ఇండస్ట్రీలో రాణించాల్సి ఉంటుంది. అక్కడ సక్సెస్ అవుతారా లేదో కూడా చెప్పలేం. ఒక్కోసారి హీరోయిన్లు అందం, అభినయంతో పాటు ఎదుటివాళ్లు చెప్పినట్లు చేస్తేనే సినీ ఇండస్ట్రీలో రాణిస్తారు. ఎక్స్ పోజింగ్ లో కూడా ఎలాంటి డౌట్ లేకుండా నటించాలి. అప్పుడే వారికంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ఇలాంటి వాటికి వేటికి తల వంచకుండా తమ స్వశక్తతో కష్టపడి ఎదిగిన వాళ్లు ఉన్నారు. మరి కొంతమంది ఇవన్నీ ఎందుకు అని ఇండస్ట్రీని వదిలేసి తమ పర్సనల్ గా బిజినెస్ లు చేసుకుంటున్నవాళ్లు ఉన్నారు.
అలా ఇండస్ట్రీని వదిలేసిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన అప్పారావు డ్రైవింగ్ స్కూల్ అనే సినిమాలో నటించిన హీరోయిన్ మాళవిక. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ మూవీలో నటించినప్పుడు కూడా రాజేంద్రప్రసాద్ తో గొడవ పడిందట. ఆ సినిమాలో రొమాంటిక్ సీన్స్, ఎక్స్ పోజింగ్ రోల్స్ చేయనని చాలా స్ట్రాంగ్ గా చెప్పేసిందట. ఈ సినిమా తర్వాత తాను సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యింది. నెక్ట్స్ మీరా చోప్రా. పవన్ కళ్యాణ్ హీరోగా యాక్ట్ చేసిన బంగారం సినిమాలో మీరా చోప్రా నటించింది.
ఈ మూవీ తర్వాత ఆమెకు ఎన్నో పాత్రలు వచ్చాయి.. కానీ ఈమె కూడా రొమాంటిక్ సీన్స్ లో యాక్ట్ చేయను అని ఖచ్చితంగా చెప్పడంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అలా ఈమె కూడా సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యింది. నెక్ట్స్ జరీనా ఖాన్.. గోపిచంద్ కు జోడీగా చాణక్య మూవీలో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్ లో యాక్టింగ్ టైమ్ లోనే ఈ హీరోయిన్ ను ఓ హీరో ఇబ్బంది పెట్టాడట. ఆ తర్వాత ఈ విషయంలో వేధింపులు ఎక్కువై.. సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యింది.