Hero: బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన హీరో సిద్ధార్థ్. కెరీర్ మొదట్లో వైవిధ్యమైన సినిమాలు చేసిన సిద్ధార్థ్ ఇటీవల మాత్రం తమిళం, తెలుగులో పెద్దగా అలరించలేకపోతున్నాడు. అయితే మనోడు మాత్రం అదితి ప్రేమాయణంతో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాడు.సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ గత కొంత కాలంగా కలిసి ఉంటున్నారని, వారిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రేమ జంట రాజస్థాన్లో మెరిసారు. శర్వానంద్ పెళ్లి రాజస్థాన్లో జరగగా అక్కడ వీరిద్దరు కలిసి తెగ సందడి చేశారు. ఇది చూసి వారి మధ్య రిలేషన్ ఉందని అందరు ఫిక్స్ అయ్యారు.
బొమ్మరిల్లు లాంటి సినిమాలతో టాలీవుడ్ లో పాతుకుపోయిన హీరో సిద్దార్ధ్… టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకున్నాడు. అయితే ఎందుకో పెద్దగా అలరించలేకపోయాడు. ఇటీవల మనోడు కాంట్రవర్సీస్తో వార్తలలో నిలుస్తున్నాడు. అయితే సిద్ధార్థ్ ఆ మధ్య టాలీవుడ్ మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడి తెలుగు ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఇక్కడ అసలు ఆఫర్లు లేకుండా చేతులారా చేసుకున్నాడు సిద్దార్థ్. ఇక ఈమధ్యే మళ్లీ మహాసముద్రం సినిమా నుంచి తెలుగులో అవకాశాలు వచ్చిన కూడా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
అయితే సిద్ధార్థ్ తాజాగా నటించిన టక్కర్ సినిమా జూన్ 9న తెలుగు తమిళ భాషలలో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసి పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇదే క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తనపై కుట్ర చేస్తున్నారని సంచలన కామెంట్స్ చేశాడు. కొందరు తనని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అన్నారు. నేను నటించిన బొమ్మరిల్లు సినిమాకు 14 నంది అవార్డులు రాగా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా సినిమాకు 11 నంది అవార్డులు దక్కాయి. అయితే వివిధ కేటగిరీలలో ఈ సినిమాలకు ఇన్ని అవార్డులు వచ్చిన నాకు మాత్రం ఒక్కటంటే ఒక్క అవార్డ్ కూడా ఇవ్వలేదని అన్నారు సిద్ధూ. ఇప్పుడు ఆయన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.