Movies: ఈ మధ్య కాలంలో థియేటర్స్ లో ప్రేక్షకులకి మంచి మజా ఇచ్చే సినిమాలు రావడం లేదు. రెండు వారాల క్రితం ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో వచ్చిన బ్రో సినిమా చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది.ఇక జూలై 28న విడుదలై బ్రో చిత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇక ఆగస్ట్‌లో సినిమాల జాతర ఉండగా, మంచి సినిమా ఒక్కటైన రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. చిరంజీవి భోళా శంకర్, రజనీకాంత్ జైలర్ ఈ నెలలోనే విడుదల కానున్నాయి. అయితే గత రెండు మూడు నెలల కంటే ఈ ఆగస్టు నెలలో చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా ఈ నెలలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధం కాగా, చివరి నిమిషంలో మూడు సినిమాలు డ్రాప్ అయ్యాయి.
వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్ కావల్సి ఉండగా, ఈ చిత్రాన్ని అక్టోబర్‌కి వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై త్రివిక్రమ్ భార్య సౌజన్యతో కలిసి నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్ కావడం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న వేళ మూవీని వాయిదా వేయడం అందరికి షాకింగ్‌గా మారింది. ఇక అనుష్క చాలా రోజుల తర్వాత చేసిన చిత్రం ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’‘. నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన ఈ మూవీపై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండడంతో చిత్రాన్ని వాయిదా వేశారు. ఆగస్టు 4న రిలీజ్ కావాల్సి ఉన్న ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది చూడాల్సి ఉంది.
ఇక శ్రీకాంత్ అడ్డాల పెదకాపు సినిమా కూడా ఆగస్టు 18న రిలీజ్ కావాల్సి ఉండగా ఈచిత్రాన్ని కూడా. టీజర్ రిలీజ్‌తోనే ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. మంచి మూవీ అని అందరు వీక్షించాలని అనుకుంటున్న సమయంలో సినిమాని వాయిదా వేశారు . మరి ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. మొత్తానికి ఒకే నెలలో రిలీజ్ కావాల్సిన మూడు సినిమాలు వాయిదా పడడంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. మరి ఈ నెలలో మరికొన్ని సినిమాలు కూడా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నా కూడా అఫీషియల్ ప్రకటన చేయలేదు.