సెకండ్ వేవ్ కారణంగా ఈ సంవత్సరంలో చాలావరకు థియేటర్లు మూసేయడం జరిగింది. అప్పటికే భారీ బడ్జెట్ లతో సినిమాలు చేసిన వాళ్ళు.. అటు ఓటీటీలకి అమ్ముకోవడం చేశారు. సినిమా హాల్స్ మూతపడటం వల్ల వాళ్ళు బాగానే నష్టపోయారని చెప్పాలి. ఐనా, థియేటర్లు ఓపెన్ ఉన్నప్పుడు రిలీజ్ ఐన సినిమాలు మంచి సక్సెస్ ని చూశాయి. అలాగే ఎన్నో experimental గా చేసిన చాలా సినిమాలు ఫట్ అన్నాయి కూడా. ఆ మూవీస్ ఏంటో చూద్దాం. ముందుగా హిట్స్..
అమ్మాయిలని రక్షించే లాయర్ నేపథ్యంలో వచ్చిన సినిమా వకీల్ సాబ్ మంచి హిట్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 కోట్ల దాకా రాబట్టిన ఈ సినిమా ఈ సంవత్సరంలో అతిపెద్ద బ్లాక్ బస్టర్. తర్వాత ఆ స్థాయిలో హిట్ ఐన మరో సినిమా ఉప్పెన. కుల గర్వం, మగతనం పట్ల ఫీల్ అయ్యే గర్వాన్ని పాయింట్ ఔట్ చేసిన మూవీ. డెబ్యూ హీరోగా వైష్ణవ్, హీరోయిన్ గా క్రితి ఇద్దరూ మంచి సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం. తర్వాత మాస్ మహారాజా మూవీ క్రాక్, కామెడీ ప్రధాన ట్రాక్ గా నడిచే జాతి రత్నాలు కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. అల్లరి నరేష్ నటించిన నాంది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక రామ్ నటించిన రెడ్, నితిన్ రంగ్ దే, శర్వానంద్ శ్రీకారం, పరవాలేదు అనిపించాయి. బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ ఏవేరేజ్ గా నిలిచింది. ఇక చిన్న సినిమాగా విడుదలైన ముఫ్ఫై రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ హిట్ అవడం విశేషం.
అలాగే.. ఫ్లాప్ గా, డిజాస్టర్ గా మిగిలిపోయిన సినిమాలు చూద్దాం. ముందుగా పెద్ద హీరోల సినిమాలు చూసినట్టయితే నాని నటించిన V మూవీ ఫ్లాప్ అయింది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ఇక అక్కినేని నాగార్జున హీరోగా చేసిన wild dog మూవీ ఫ్లాప్ గానే మిగిలిపోయింది. తెల్లవారితే గురువారం, ఈ కథలో పాత్రలు కల్పితం, డర్టీ హరి, చావు కబురు చల్లగా, శశి, మోసగాళ్ళు, దేవరకొండలో విజయ్ ప్రేమకథ, గాలి సంపత్, శ్రీ పరమానందయ్య శిష్యుల కథ, గజకేసరి, దేవినేని, క్లైమాక్స్, కపటదారి, Fcuk, చేతిలో చెయ్యేసి చెప్పు బావా, కళా పోషకులు, జై సేన, అన్నపూర్ణమ్మ గారి మనవడు, అమ్మ దీవెన ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అయిపోయాయి.
Leave a comment