NagaBabu Wife: మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. వీరి గురించే కాదు వీరి భార్యల గురించి, వారి బ్యాక్‌గ్రౌండ్ గురించి కూడా అందరికి తెలుసు. చిరంజీవి- సురేఖల పెళ్లి ఎలా జరిగింది, పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం ఎవరు, ఎవరెవరిని చేసుకున్నాడు వంటి విషయాలు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంటాయి. అయితే నాగబాబు అలియాస్ నాగేంద్రబాబు సతీమణి పద్మజ గురించి మాత్రం చాలా మందికి పూర్తిగా తెలియదు. 29 ఏళ్ల వయస్సులో పద్మజతో ఏడడుగులు వేసిన నాగబాబు.. వరుణ్ తేజ్, నిహారికలకి జన్మనిచ్చారు. వీరిద్దరు కూడా ఇప్పుడు తెలుగు సినీ రంగంలో రాణిస్తున్నారు.
అప్పట్లో ప్రేమ పెళ్లిళ్లు చాలా తక్కువ కాగా, ఎక్కువగా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకునే వారు.నాగబాబుది కూడా పెద్దలు కుదిర్చిన వివాహమే. నాగబాబు తల్లి అంజనాదేవి ఓ సారి పాలకొల్లులో బంధువుల వివాహంకి వెళ్లగా , అక్కడ తొలిసారి పద్మజను చూశారట. తొలి చూపులోనే పద్మజ అంజనాదేవికి తెగ నచ్చేయడంతో ఆమె కుటుంబ వివరాలను తెలుసుకున్నారట. మంచి కుటుంబం.. చిన్న తనం నుంచి పద్మజ చాలా పద్ధతిగా పెరిగిందని అంజనాదేవికి ఆ ఊరి వారు చెప్పడంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆమెను నాగబాబుకి ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లైనప్పటి నుండి వీరిద్దరు చాలా అన్యోన్యంగా ఉంటూ వస్తున్నారు.
నాగబాబు, పద్మజలకు అప్పట్లోనే ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి తర్వాత పద్మజ సంపూర్ణ గృహిణిగా మారగా, భర్తకు కష్టసుఖాల్లో చాలా అండగా నిలిచింది. నిర్మాతగా నాగబాబు చాలా కోల్పోయిన సమయంలో పద్మజ అతనికి ధైర్యం చెప్పి సపోర్ట్‌గా ఉంది. అయితే పద్మజ గురించి మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఆమె చిన్నతనం నుంచి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని కాగా, ఆమె చిరు పేపర్ కటింగ్స్ ను సేకరించి ఒక బుక్కు లాగా కూడా తయారు చేసుకొని జాగ్రత్తగా పెట్టుకునేదట. అంతలా చిరంజీవిని ఇష్టపడ్డ పద్మజ ఆ ఇంటి కోడలిగా వెళ్లడం ఆమెకి ఎంతో ఆనందాన్ని కలిగించింది.