ఎం.ఎం. కీరవాణి ఎంత పేరెన్నిక గన్న సంగీత దర్శకుడు అనేది తెలుగు ప్రేక్షకులకి బాగా తెలుసు. ఇప్పటివరకు ఆయన మ్యూజిక్ అందించిన సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధించాయి. కీరవాణి అంతలా సంగీత అభిమానులకి చేరువయ్యారు. ఎన్నో దశాబ్దాలుగా ఆయన ఇస్తున్న సంగీతం ఎంతో పాపులర్ అవుతూ ఉండటం వల్ల ఆయన రెమ్యూనరేషన్ కూడా అలా పెరుగుతూనే వచ్చింది. ఆయన సోదరుడే అయిన రాజమౌళి కూడా కమర్షియల్ గా హిట్ అవుతూ ఉండటం వాళ్ళ పారితోషకాలని భారీగా పెంచేసింది. అలా వాళ్ళు కుటుంబంగా కలిసి పనిచేసిన పెద్ద సినిమా ‘బాహుబలి’.
ఇప్పుడు RRR గా వస్తున్న మరో చిత్రంలో కూడా వీళ్ళు కలిసి పనిచేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఐతే, ఇందులో రాజమౌళి రెమ్యూనరేషన్ బేస్డ్ గా కాకుండా.. స్వయంగా సినిమాలో పెట్టుబడి పెట్టి మూవీ తీస్తున్నాడు. ఇలా చేయడం ద్వారా.. ఎక్కువ శాతం లాభాలు తన దగ్గరే మిగిలిపోతాయన్న ఆలోచన ప్రధానం కావచ్చు. ఇప్పటికే పెడుతున్న బడ్జెట్ కన్నా ఈ మూవీ డబుల్ బిజినెస్ చేస్తుంది. ఇంకా ఈ మూవీ షూటింగ్ నే పూర్తి చేసుకోలేదు అంటే అస్సలు నమ్మలేం.
ఐతే, కీరవాణి మాత్రం ఇందులో రెమ్యునరేషన్ బేస్డ్ గానే పనిచేస్తున్నారు. సహజంగా ఒక మామూలు సంగీత దర్శకుడికి కోటి నుంచి రెండు కోట్ల వరకు వెచ్చిస్తారని అంచనా. కాస్త గుర్తింపు తెచ్చుకున్నవాళ్ళకి 5 కోట్ల వరకు ఇస్తారు. కానీ ఈ మూవీకి మాత్రం కీరవాణి ఏకంగా 16 కోట్లు వసూలు చేస్తున్నారట. అయితే.. ఇది పుకారు కూడా అయి ఉండొచ్చనే మాట వినిపిస్తుంది. ఒకవేళ కీరవాణి గారు ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మాట నిజమైతే ఆయన పెద్ద రికార్డ్ సృష్టించినట్లే అవుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవ్వరూ అంత పారితోషికం తీసుకోలేదు టాలీవుడ్ లో.
Leave a comment