Actress: అలనాటి నాయిక మంజుల వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వనిత విజయ్ కుమార్.ముందు తమిళంలో కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత దేవి సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయింది. ఈ సినిమానే ఆమెకి తెలుగులో చివరి సినిమా కూడా కావడం విశేషం. ఇటీవల నరేష్ హీరోగా తెరకెక్కిన మళ్లీ పెళ్లి అనే సినిమాలో మెరిసింది. అయితే వనిత విజయ్ కుమార్ సినిమాల కన్నా కూడా వివాదాలతో ఎక్కువగా హాట్‌టాపిక్ అవుతుంది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న వనిత కొన్ని సార్లు తన తండ్రి తన పాలిట విలన్ అని కూడా చెప్పుకొచ్చింది. తనకి 20 ఏళ్ల వయసున్నప్పుడే ఆకాశ్ అనే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఆమె తన కుటుంబానికి పూర్తిగా దూరమైంది.
ఆకాశ్‌తో తన మొదటి పెళ్లి గురించి తాజాగా మాట్లాడిన వనిత.. అతనితో రెండేళ్లకి పైగా కలిసి ఉన్నాయి. మాకు ఒక అబ్బాయి పుట్టాడు. అయితే మా మధ్య రిలేషన్ అంత బాగుండేది కాదు. నా కొడుకు మాత్రమే నా జీవితంలో జరిగిన దారుణాలకి సాక్షి. చిన్న వయస్సులోనే నా పరిస్థితి అర్ధం చేసుకొని నేను తీసుకున్న నిర్ణయాలని చాలా సపోర్ట్ చేశాడు. వాడే నాకు చాలా బలం ఇచ్చాడు. విజయ్ శ్రీహరి నా కొడుకు పేరు కాగా, నేను ఈ రోజు బ్రతికి ఉండడానికి అతనే కారణం అని చెప్పుకొచ్చింది వనిత. అయితే తాను పాపతో ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు విడాకులకి అప్లై చేసిందట. అప్పుడు తన తల్లిదండ్రులు ఏ మాత్రం సపోర్ట్ చేయలేదని పేర్కొంది వనిత.
నన్ను ఇంటి నుండి గెంటి వేసిన కూడా నాతో ధైర్యంగా నిలబడింది నా కొడుకే. ప్రస్తుతం అతను నాతో కాంటాక్ట్‌లో లేడు. అతనిని నాతో ఉంచుకోవడానికి ఎంత ప్రయత్నించిన కూడా అది సాధ్యపడలేదు అంటూ ఎమోషనల్ అయింది వనిత. అయితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నా కూడా ఏ ఒక్క భాగస్వామితో వనితాకు కొంత సంతోషం దొరకలేదు. జీవితం అంతా వివాదాలే. సర్వస్వం అనుకున్న కొడుకు కూడా తనతో లేకపోవడంతో ఆమెని సపోర్ట్ చేసే కొందరు బాధపడుతున్నారు. అయితే తన జీవితంలో ఏం జరిగినా కుటుంబం తనను వద్దనుకున్నా కూడా తను మాత్రం విజయ్‌కుమార్ వారసురాలని గర్వంగా చెప్పుకుంటుంది వనితా.