Nayanthara: సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది నయనతార. ఆమె తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. స్టార్ హీరోలకు ధీటుగా ఏమాత్రం తగ్గకుండా వారికి పోటీ ఇస్తూ ఎవర్ గ్రీన్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అంటే అది హీరోయిన్ నయనతార మాత్రమే అనే రేంజ్ లో ఇమేజ్ దక్కించుకుంది. ప్రజంట్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తూ ఇండియా వైడ్ గా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది.
ఇక కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది నయనతార. వీరికి కవల పిల్లలు కూడా. నయనతారకు కోట్లల్లో ఆస్తి ఉంది అనే వార్తలు ప్రజంట్ వైరల్ అవుతున్నాయి. ఒక్కో సినిమాకు మినిమం పది కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక ప్రజంట్ నయనతార దగ్గర 260 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా కూడా నయనతార ప్రైవేట్ జెట్ ని కూడా కొన్నారు. ఇంకా నయనతారకు హైదరాబాద్, చెన్నై, కేరళ లాంటి నగరాల్లో ఓ రేంజ్ లో సొంత భవనాలు.. పొలాలు కూడా ఉన్నాయి.
పలు బిజినెస్ ల్లో కూడా పెట్టుబడులు కూడా పెట్టారట. ఇంకా అడ్వర్టైజ్ మెంట్స్ లో కూడా వర్క్ చేస్తుంది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ కంటే నయనతారకు ఎక్కువ ఆస్తి ఎక్కువగా ఉంది. ఇక విఘ్నేష్ శివన్ ఆస్తి అంతా కలిపి 50 కోట్లకు మించి ఉండదు. నయనతార ఆస్తి మాత్రం ఏకంగా 260 కోట్లకు పైగానే తెలుస్తుంది. దీంతో నయనతార ఆస్తులతో పోలిస్తే.. విఘ్నేష్ శివన్ కు చాలా తక్కువ అనే న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రజంట్ నయనతార బాలీవుడ్ లో అట్లీ డైరెక్షన్ లో బాలీవుడ్ కా బాద్ షా షారూక్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.