Nagababu: మరి కొద్ది రోజులలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి జరగనుండగా, అందుకు సంబంధించి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో నిహారిక విడాకుల ప్రకటన చేసి అందరికి షాక్ ఇచ్చింది. చైతన్య, నిహారికకు కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయగా, వారు ఇక కలిసే అవకాశం లేదు. భర్త చైతన్యతో పాటు అత్తారింటి ఆంక్షలు ఆమెను ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తుండగా, ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధల వలన వారు విడాకులు తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఎంతో అట్టహాసంగా తన కూతురు పెళ్లి చేసిన నాగబాబు, ఇప్పుడు విడాకుల విషయంతో చాలా కుమిలిపోతున్నట్టు తెలుస్తుంది.
డిసెంబర్ 9, 2020న నిహారిక నాగ చైతన్యలు పెళ్లి చేసుకోగా,అనుకోని కారణాల వలన జూన్ 5న విడాకులు తీసుకున్నారు. ఇక జూలై 5న వారిద్దరు తమ విడాకులకి సంబంధించి అఫీషియల్‌గా ప్రకటన చేశారు. ఈ విషయం చెప్పిన దగ్గర నుండి నాగబాబు చాలా కుమిలిపోతున్నారట. తాను చేసిన అతి గారాబం కూతురు విడాకులు తీసుకునేందుకు కారణమైందని తన సన్నిహితుల దగ్గర నాగబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
విడాకుల తర్వాత నిహారికకి సంబంధించిన అనేక విషయాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. నిహారికకు వివాహ సమయంలో వారి కుటుంబసభ్యులు భారీగానే కట్న కానుకలు సమర్పించుకున్నట్టు తెలుస్తుంది. డబ్బు రూపంలో కాకుండా భారీగానే ఆస్తులు ఇచ్చారని సమాచారం.నిహారిక తండ్రి దాదాపు 70 కోట్ల రూపాయలతో పెళ్లి జరపడంతో పాటు భారీగానే ఆస్తులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక నాగబాబు అన్నయ్య చిరంజీవి ఏకంగా రెండు కోట్ల విలువ చేసే వజ్రాల హారాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇక నిహారిక అన్న వరుణ్ తేజ్ రెండు కోట్ల విలువ చేసే ఫ్లాట్ ను గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారని టాక్. ఇక ఇదిలా ఉంటే నిహారిక విడాకుల తర్వాత నటిగా, నిర్మాతగా చాలా బిజీగా ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతగా నిలబడాలని నిహారిక భావిస్తుంది.