Allu Arjun: అల్లు రామలింగయ్య మనవడిగా చిరంజీవి స్పూర్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో వెండితెరకి పరిచయం అయిన బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఇక ఈ సినిమా ఆయనకి నేషనల్ అవార్డ్ కూడా దక్కేలా చేసింది. ప్రస్తుతం పుష్ప 2 చిత్రం చేస్తుండగా, ఈ చిత్రం బన్నీ క్రేజ్ విశ్వవ్యాప్తం చేయనుందని కొందరు జోస్యాలు చెప్పుకొస్తున్నారు. అయితే 69 ఏళ్ల కలని నిజం చేసిన బన్నీ పేరు ఇప్పుడు అంతటా మారుమ్రోగిపోతుంది. ఈ క్రమంలోనే ఆయన గురించి అనేక విషయాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.అయితే అల్లు అర్జున్ కి బన్నీ అనే నిక్ నేమ్ ఉండగా, అల్లు అర్జున్ అనే పేరు పెట్టక ముందే ఇంట్లో వాళ్లు అతనికి బన్నీ అని పేరు పెట్టారట. ఇలా పెట్టడం వెనక కారణం తెలిస్తే నవ్వుకోకుండా ఉండలేరు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆర్య సినిమానే ఈయనకు తొలి హిట్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక అల్లు అర్జున్ చిన్నప్పుడు బన్నీ అనే పేరుతో ఎక్కువగా పిలవబడ్డాడు. ఇక ఇప్పుడు ఆయన అభిమానులు, సన్నిహితులు కూడా బన్నీ అనే పిలుస్తూ ఉంటారు. అల్లు అర్జున్‌కి మూడు సంవత్సరాలు వచ్చే వరకు కూడా బన్నీ అనే పేరే ఉంది. ఇక బన్నీ అంటే చిన్న కుందేలు పిల్ల అని అర్థం కాగా, ఆయన ఇంట్లో వాళ్ళు అల్లు అర్జున్ కి బన్నీ అనే పేరు పెట్టడం వెనక ఒక కారణం ఉందట.
చిన్నప్పుడు బన్నీ రెండు పళ్లు కుందేలులా కాస్త ముందుకు ఉండేవట. ఆ కారణం వల్లనే ఆయన కుటుంబ సభ్యులు అతనికి బన్నీ అని పేరు పెట్టారట. చాలా మంది బన్నీ అనే సినిమా చేశాడు కాబట్టి అలా పేరు పెట్టి ఉంటారని అనుకుంటారు. కాని అసలు విషయం ఇది. ఈ విధంగా చిన్నప్పటి నుండి బన్నీ అనే పేరుతోనే అల్లు అర్జున్ ఎక్కువ ఫేమస్ కాగా, ఆయనని అభిమానులు సందర్భాన్ని బట్టి ఒక్కో రకంగా పిలుచుకుంటూ ఉంటారు.