Ileana: గోవా బ్యూటీ ఇలియానా కొన్ని నెలల క్రితం సడెన్‌గా తాను ప్రగ్నెంట్ అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది. పెళ్లి కాకుండానే ఇలియానా ప్రగ్నెంట్ అనే సరికి అందరు షాకయ్యారు. అసలు ఇలియానాని ప్రగ్నెంట్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని తెగ ఆరాటపడ్డారు. అయితే ఇలియానా మాత్రం సస్పెన్స్ కంటిన్యూ చేస్తూ వచ్చింది. బాయ్‌ఫ్రెండ్ ఫొటోలను కూడా షేర్ చేస్తున్నప్పటికీ ముఖాన్ని మాత్రం కనిపించకుండా దాచిపెట్టింది.దాంతో ఒక్కొక్కరు ఒక్కోలా ఊహించుకున్నారు. ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ మిస్టరీ మ్యాన్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో పెరిగింది.
ఇటీవల అతనితో క్లోజ్ గా దిగిన ఫోటోని షేర్ చేసింది. కానీ ఈ ఫోటో బ్లర్ గా ఉండటంతో అందులో ఉన్నది ఎవరో ఎవరికి అర్ధం కాలేదు. ఆ తర్వాత అతనితో దిగిన సెల్ఫీ ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అందులో కూడా అతని ఫేస్ క్లారిటీ లేదు. కుక్కతో దిగిన ఫొటో షేర్ చేసిన అందులో ఫేస్ రివీల్ కాలేదు. తాజాగా ఈ దాగుడుమూతలకు ఇలియానా తెరదించింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన జీవితంలోకి వచ్చిన మిస్టరీ మ్యాన్ ముఖాన్ని రివీల్ చేసి ఆశ్చర్యపరచింది.. బ్లాక్ షర్ట్ ధరించి, గడ్డంతో వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను షేర్ చేయగా, అతనికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు.
ఇలియానా.. కత్రినా కైఫ్ తమ్ముడితో డేటింగ్ లో ఉందని తెగ ప్రచారం జరిగింది. కాని ఇప్పుడు ఇలియానా పోస్ట్ చేసిన ఫోటోలో ఉన్న వ్యక్తి వేరే అతను కావడంతో ఈ కొత్త వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఒక్కొక్కటి మెల్లి మెల్లిగా రివీల్ చేస్తున్న ఇలియానా అతని గురించి త్వరలో చెప్తుందేమో అని నెటిజన్స్ ముచ్చటించుకుంటున్నారు. ఇక ఇలియానా ప్రస్తుతం 9 నెలల నిండు గర్భవతి అని తెలుస్తుండగా, త్వరలో బిడ్డకి జన్మనివ్వబోతోంది. ఇటీవల ఇలియానాకి పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో ఈ అమ్మడు ఇక కెరీర్‌కి స్వస్తి పలికి పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని నిర్ణయించుకుందని తెలుస్తుంది.