Tarak: తాత వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా మారాడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా కూడా ఎదిగాడు. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్‌కి వరుసగా కొన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. అయిన కూడా అధైర్యపడకుండా అదే జోష్ని కొనసాగిస్తూ మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల మెప్పుపొందాడు. పూరీ తెరకెక్కించిన టెంపర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ నటించిన అరవింద సమేత చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఇక జూనియర్ కెరీర్ జెట స్పీడ్‌తో దూసుకుపోయింది.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో జాన్వీ కథానాయికగా నటిస్తుంది. ఇక ఇటీవల పూర్తయిన షెడ్యూల్లో పోరాట ఘట్టాలను తెరకెక్కించినట్టు తెలుస్తుండగా, ఈ నెల 20 నుంచి మొదలుకానున్న కొత్త షెడ్యూల్లో టాకీ పార్ట్‌ను చిత్రీకరించబోతున్నారని సమాచారం. మరోవైపు వార్-2’ చిత్రం ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్లో అరంగేట్రం చేయబోతున్న విషయం విదితమే. ఇందులో బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్‌తో కలిసి సందడి చేయనున్నాడు జూనియర్. నవంబర్‌లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తన ప్రతి సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెడతారనే విషయం మనకు తెలిసిందే. నటుడు అనేవాడు సౌకర్యవంతమైన పాత్రలు చేస్తూ ఉండిపోకూడదు. ఎప్పటికప్పుడు విలక్షణమైన పాత్రలు చేస్తుంటేనే ఎక్కువకాలం సినీరంగంలో నిలబడగలుగుతారని ఎన్టీఆర్ నమ్ముతుంటారు. అయితే ఎన్టీఆర్ చిన్నప్పటి నుండి అజయ్‌దేవగణ్ సినిమాలు చూస్తూ పెరిగాడట. దేవగణ్ సినిమాల్లోని పూల్ ఔర్ కాంటే చిత్రంలో ఒక బైక్ స్టంట్ తనకు బాగా నచ్చిందని, అలాంటి స్టంట్ చేసేందుకు తనకు అవకాశం వస్తుందేమోనని ఆశగా చూసానని అన్ను. అయితే అవి సినిమాల్లో వరకు బాగానే ఉంటాయి. బయట చేయోద్దంటూ తన తల్లి ఓ సారి వారించిందని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్