Agent Tina: కొన్ని సినిమాల్లో హీరో, హీరోయిన్లతో పాటు.. కథలో కీలకమైన క్యారెక్టర్లు, కథను మలుపుతిప్పే క్యారెక్టర్లు కొన్ని అరుదుగా కనిపిస్తుంటాయి. తెరమీద కనిపించింది కాసేపే అయినా ఇంపార్టెన్స్‌ని బట్టి ఆ రోల్ చేసిన నటి లేదా నటుడికి మంచి గుర్తింపుతో పాటు మరిన్ని ఆఫర్లు కూడా వస్తుంటాయి.
ఈమధ్య ప్రేక్షకుల నోళ్లల్లో నానుతున్న పేరు ఏజెంట్ టీనా.. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘విక్రమ్’ మూవీలో తమిళ్ ఇండస్ట్రీకి చెందిన వాసంతి చేసిన ‘ఏజెంట్ టీనా’ క్యారెక్టర్‌కి థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఆ క్యారెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలిసేలా తక్కువ స్క్రీన్ స్పేస్ అయినా కానీ చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్. బేసిక్‌గా వాసంతి సీనియర్ డ్యాన్సర్. పాపులర్ కొరియోగ్రాఫర్స్ దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేసింది. తమిళ్‌లో స్టార్ హీరోల సినిమాలకు కూడా పని చేసింది.


టీనా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. కమల్ హాసన్, ఆర్.మాధవన్ ప్రధానపాత్రల్లో ఖుష్బూ భర్త సుందర్.సి. దర్శకత్వంలో ‘అన్బే శివమ్’ (Anbe Sivam) మూవీ వచ్చింది. 2003లో ‘సత్యమే శివం’ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఇందులో వాసంతి, కమల్ పక్కన కాసేపు కనిపిస్తుంది.. ఆ పిక్, ‘విక్రమ్’ అప్పటి పిక్..రెండిటినీ చూపిస్తూ.. ‘‘ఏజెంట్ టీనా 2003 నుండి ఏజెంట్ విక్రమ్ దగ్గర పనిచేస్తుంది’’ అంటూ ఇంట్రెస్టింగ్ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది.

Leave a comment