Suma Rajeev: ఇండస్ట్రీలో కొన్ని చూడముచ్చటైన జంటలు ఉన్నాయి. ఎన్ని గొడవలు వచ్చిన, ఎన్ని సమస్యలు వారిని చుట్టుముట్టిన కూడా వారు విడాకుల వరకు వెళ్లకుండా వారి వైవాహిక జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు. అలాంటి జంటలలో సుమ- రాజీవ్ కనకాల జంట తప్పకుండా ఉంటుంది. ఈ ఇద్దరు ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నా పర్సనల్ లైఫ్‌లో మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. రాజీవ్ కనకాల సిల్వర్ స్క్రీన్‌పై తెగ సందడి చేస్తుండగా, సుమ బుల్లితెర రారాణిగా ఓ వెలుగు వెలుగుతుంది. అయితే కొన్నాళ్ల క్రితం వీరిద్దరు విడిపోయినట్టు సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడిచింది. దానికి వారు పులిస్టాప్ పెట్టే ప్రయత్నాలు చేసిన కూడా అవి ఆగడం లేదు.
తాజాగా శ్రీసింహ కోడూరి హీరోగా నటిస్తున్న ‘భాగ్ సాలే’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ, రాజీవ్ కనకాల అన్యోన్యతని చూసి వారిరివురు సంతోషంగా ఉన్నారని ప్రతి ఒక్కరు భావించారు. ఇక ఇదే వేదికపై రాజీవ్ కనకాల తమ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చెప్పి ఆశ్చర్యపరిచారు. ‘భాగ్ సాలే’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజీవ్ స్టేజ్‌పైకి రాగానే సినిమా టైటిల్‌కు సంబంధించిన క్లారిటీ ఇస్తూ తన లైఫ్‌లో జరిగిన ‘భాగ్ సాలే’ మూమెంట్ గురించి చెప్పుకొచ్చాడు.
సుమను పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు మా ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నారు. అయితే వాళ్లింట్లో ఒప్పుకోలేదు. దాంతో సుమను లేవదీసుకుని పోయే ప్లాన్ చేశాను. ఈ విషయం సుమకి కూడా చెప్పాను. ముందు రోజు రాత్రి వారాసిగూడలో పారిపోవటానికి ఒక బైక్ కూడా రెడీగా పెట్టుకొని..యాదగిరిగుట్టకు వెళ్లి పెళ్లి చేసుకోవాలా! మా అమ్మనాన్న పెళ్లి చేసుకున్న చోటికి వెళ్లాలా? అని ఎన్నో ఆలోచనలు చేశాను. మరుసటి రోజు సుమ ఫోన్ చేసి మన పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నారని చెప్పటంతో సైలెంట్ అయిపోయాను’’ అని తన లవ్‌స్టోరిలో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పుకొచ్చారు రాజీవ్ కనకాల. త్వరలో సుమ- రాజీవ్ కనకాల దంపతులు తమ కుమారుడిని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయాలని చూస్తున్నారు.