మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్. తన మొదటి సినిమాతోనే తన నటనతో మెగా అభిమానులు మెప్పించి మెగాస్టార్‌కు తగ్గ కొడుకుని అనిపించుకున్నాడు చరణ్. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో మెగా పవర్ స్టార్ గా మారాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు.
ఈ సినిమా ఆ రోజుల్లోనే ఏకంగా రూ.70 కోట్లకు పై బాగా కలెక్షన్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో రాజమౌళి, రామ్ చరణ్ ను రెండు డిఫరెంట్ యాంగిల్ లో చూపించి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశాడు. అంతేకాకుండా రామ్‌చరణ్ యాక్టింగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి కూడా చిన్న పాత్రలో నటించాడు. అలా తండ్రి కొడుకులను ఓకే ఫ్రేమ్‌లో చూసి మెగా అభిమానులు ఎంతో ఆనందించారు.
అయితే ఇక్కడ ఎవరికి తెలియని మరో విషయం ఏమిటి అంటే ఈ సినిమాలో చిరంజీవి చేసిన రోల్లో ఆయన ఆసలు నటించలేదట. ఆదే సమయంలో చిరు రాజాకియ్యలో బిజీగా ఉన్నడంతో అయను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక రాజమౌళి మరో నటుడుతో చిరంజీవికి డూప్ గా చేయించారట. ఇంతకి ఆ నటుడు మరి ఎవరో కాదు ప్రభాస్ శీను. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ శీను చిరంజీవిని బాగా ఇమిటేట్ చేస్తూ ఆయన లాగే ప్రవర్తించే వారట. ఆ సమయంలో రాజమౌళి ప్రభాస్ శీను తోనే చిరంజీవికి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించారట. ఇక ఇదే విషయని ప్రభాస్ శ్రీను కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ప్రస్తుతం చిరంజీవికి జాతీయ అవార్డు రావడంతో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి