Bimbisara: ‘బింబిసార’గా బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. భారీ బడ్జెట్‌తో, టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్లో, కొత్త డైరెక్టర్‌కి అవకాశమిస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ బావమరిది కె.హరికృష్ణ నిర్మించిన ‘బింబిసార’ చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది.
రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కి చేరుకుని.. నాలుగో రోజునుండి డిస్ట్రిబ్యూటర్లను, బయ్యర్లను లాభాల బాట పట్టించింది. తెలుగు ఇండస్ట్రీకి ఈ సినిమా సక్సెస్ కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అయితే ఈ కథని డైరెక్టర్ ముందుగా మాస్ మహారాజా రవితేజకు వినిపించాడట.
వశిష్ట తండ్రి మల్లిడి సత్యనారాయణ రెడ్డి, రవితేజతో ‘భగీరథ’ అనే సినిమా చేశారు. ఆ పరిచయంతో వశిష్ట, రవికి ‘బింబిసార’ కథ చెప్పాడట. ఇన్నేళ్ల కెరీర్లో ఎంతోమంది కొత్త దర్శకులను పరిచయం చేసిన రవితేజ.. వశిష్ట విషయంలో ఎందుకు వెనకడుగు వేశాడంటే.. కొత్త కుర్రాడు.. ఇంత భారీ సబెక్ట్ హ్యాండిల్ చేస్తాడా, లేదా అనే డౌట్‌తో పాటు.. కథలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చెయ్యడం ఎందుకో రిస్క్ అనిపించి వశిష్టకి ‘నో’ చెప్పాడట.
ఇంతకుముందు ‘పోకిరి’, ‘ఊసరవెల్లి’, ‘పటాస్’ సినిమాలకు కూడా ‘నో’ చెప్పాడట. రవితేజ హీరోగా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద ‘కిక్ 2’ చేయగా.. సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.
Leave a comment