RGV: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు. కాని ఇటీవలి కాలంలో కాంట్రవర్సీస్తోనే టైం పాస్ చేస్తున్నాడు. సినిమాలు, రాజకీయాలతో పాటు ఇతర విషయాల గురించి ట్విట్టర్ లో స్పందిస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటాడు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన కూడా తనకు నచ్చిందే చేస్తూ చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తుంటాడు. అమ్మాయిలతో ఆర్జీవి చేసే రచ్చ పీక్స్ లో ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆర్డినరీ సినిమాలు చేస్తున్న రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాలలో కూడా వేలుపెడుతున్నాడు.
ముఖ్యంగా జగన్‌ని సపోర్ట్ చేస్తూ అటు పవన్ కళ్యాణ్‌ని, ఇటు చంద్రబాబుని విమర్శిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా అతను వారిద్దరిపై సినిమాలు చేస్తుండడం విశేషం. ప్రస్తుతం వ్యూహం అనే సినిమాని ఆర్జీవి చేస్తుండగా, ఈ చిత్రంతో జగన్‌కి మరింత దగ్గర కాబోతున్నాడట రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు రానున్న ఎలక్షన్స్ లో ఆయన పోటీ కూడా చేయబోతున్నట్టు జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ తన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడాడు. తనని కొన్ని పొలిటికల్ పార్టీలు తమ పార్టీల్లోకి రమ్మని ఆహ్వానించాయంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
గతంలో కొంతమంది రాజకీయ నాయకులు నన్ను కలిసి తమ పార్టీల్లోకి రావాలని ఆహ్వానించారు. అంతేకాదు నన్ను పోటీ చేయమని కూడా అడిగారు. నాకు కాస్త ఫాలోయింగ్ ఉంది కాబట్టి, నేను వస్తే వాళ్ళకి ఓట్లు వస్తాయని వారు భావించారు. అయితే నేను పాలిటిక్స్ లోకి అస్సలు రాను. నాకు సర్వీస్ చేయడం రాదు, నేను ఇంకొకరి కోసం పని చేయలేను కూడా. ఈ కారణంతోనే నేను పాలిటిక్స్ లోకి రాను. కానీ రాజకీయాలపై సినిమాలు మాత్రం తీస్తాను. భవిష్యత్తులో కూడా ఇలా పొలిటికల్ సినిమాలు తీసే అవకాశం ఉందని రామ్ గోపాల్ వర్మ అన్నారు.. నాకు పొలిటికల్ సైకాలజీ అంటే ఎంతో ఇష్టం అని కడా వర్మ అన్నారు.