Mirchi Beauty: డార్లింగ్ ప్రభాస్ నటించిన మిర్చి చిత్రంలో కథానాయికగా నటించిన రిచా గంగోపాధ్యాయ తెలుగు సినీ ప్రేక్షకులకి గుర్తుండే ఉంటుంది. దగ్గుబాటి రానా నటించిన లీడర్ చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయిన రిచా అనంతరం మాస్ మహారాజా రవితేజ సరసన మిరపకాయ్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో రిచా సాంప్రాదాయబద్ధమైన బ్రాహ్మాణ యువతిగా నటించి అలరించింది. ఈ సినిమా తర్వాతనే ప్రభాస్ సరసన మిర్చీ సినిమాలో కథానాయికగా అవకాశం దక్కించుకుంది. మిర్చి సినిమా పెద్ద హిట్ కావడంతో ఈ బ్యూటీ వరుస ఆఫర్స్ తలుపుతట్టాయి.
నాగవల్లి, సారోచ్చారు, భాయ్ తదితర చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్న రిచా అనంతరం సినిమాలకి దూరమైంది. అయితే సడెన్గా ఆమె తెలుగు తెరకి దూరం కావడం పట్ల అనేక ప్రచారాలు సాగాయి. ఓ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో స్టార్ హీరో తన కార్ వ్యాన్ లో రిచాతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడట. అలా చేసినందుకు రిచా ఆ హీరోను చెప్పుతో కొడతానంటూ గట్టి వార్నింగ్ ఇచ్చిందట. అప్పుడు ఆ హీరో రిచాని బ్లాక్ మెయిల్ చేశాడట. ప్రైవేట్ వీడియోస్ తన వద్ద ఉన్నాయంటూ బెదిరించి టార్చర్ చేసేసరికి చాలా ఇబ్బందులు పడిందట.
ఒక వైపు సినిమా అవకాశాలు రాక, మరోవైపు బెదిరింపులు తట్టుకోలేక రిచా ఇండస్ట్రీ నుంచి దూరమైనట్లు పలు మీడియాల్లో వార్తలు వచ్చాయి. 2013లో చదువుల కోసం అని విదేశాలకి వెళ్లిన రిచా 2017లో సెయింట్ లూయిస్లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి ఎమ్బీఏ డిగ్రీని పూర్తి చేసింది. ఇక 2019లో తన చిన్ననాటి స్నేహితుడు జో లాంగేల్లా ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2021లో ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా పుట్టాడు. అతనికి లూకా షాన్ లాంగెల్లా అని పేరు పెట్టారు. అప్పుడుప్పుడు సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు రిచా విదేశాల్లో భర్త, కుమారుడితో హ్యాపీ జీవితం గడుపుతుంది.