Peddarikam Movie: తెలుగు ఇండస్ట్రీలో లవ్ స్టోరీలు.. ప్రేమకోసం పెద్దవాళ్లను ఎదురించే కథలు చాలానే వచ్చాయి.. వాటిలో చాలా వరకు హిట్ అయిన సినిమాలున్నాయి. ఆ కోవలో జగపతి బాబు హీరోగా నటించిన ‘పెద్దరికం’ మూవీ ముప్ఫై ఏళ్ల క్రితం పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.
1991లో మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘గాడ్ ఫాదర్’ అనే సినిమాని ‘పెద్దరికం’ పేరుతో రీమేక్ చేశారు. సూర్య చిత్ర బ్యానర్ మీద నిర్మిస్తూ.. మొట్టమొదటి సారి మెగాఫోన్ చేతబట్టారు ఎ.ఎమ్.రత్నం. పరుచూరి బ్రదర్స్ మాటలు రాయగా.. రత్నం స్క్రీన్‌ప్లే కూడా అందించారు.
1992 జూన్ 18న రిలీజ్ అయిన సూపర్ హిట్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘పెద్దరికం’ 2022 జూన్ 18తో 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటోంది. సీనియర్ నటులు, దర్శకులు ఎన్.ఎన్.పిళ్లై ఒరిజినల్ వెర్షన్లో చేసిన క్యారెక్టర్‌నే తెలుగులోనూ చేశారు. హీరోయిన్గా సుకన్యకి తెలుగులో ఫస్ట్ సినిమా..
అడుసుమిల్లి బసవపున్నమ్మ (భానుమతి రామకృష్ణ), పర్వతనేని పరుశురామయ్య (ఎన్.ఎన్.పిళ్లై) కుటంబాల మధ్య వైరం ఉంటుంది.. పగ తీర్చుకోవడానికి బసవపున్నమ్మ మనవరాలు జానకి (సుకన్య) పరశురామయ్య చిన్నకొడుకు కృష్ణ మోహన్ (జగపతిబాబు) ని ప్రేమించినట్లు నాటకమాడుతుంది. ఒకరినొకరు అవమానించుకోవాలని ట్రై చేసే ప్రాసెస్‌లో నిజంగానే ప్రేమించుకుంటారు.. దీంతో మళ్లీ రెండు కుటుంబాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరతాయి.. చివరకి వారి మధ్య వైరం ఎలా ముగిసింది.. ప్రేమికులు ఎలా కలిశారు అనే కథతో తెరకెక్కిన ‘పెద్దరికం’ కి ప్రేక్షకులు పెద్ద పీట వేశారు.
నటీనటులంతా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. భానుమతి, పిళ్లై పాత్రల్లో హుందాతనం ఉట్టిపడుతుంది. రాజ్ కోటి సంగీతం సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచింది. ‘ఇదేలే తరతరాల చరితం’ పాట బాగా పాపులర్ అయ్యింది. మిగతా పాటలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి.. నేపథ్య సంగీతం బాగుంటుంది. ఎస్.గోపాల్ రెడ్డి ఫొటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
Leave a comment