తెలుగు చిత్ర పరిశ్రమకు నందమూరి కుటుంబం నుంచి మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. యంగ్ టైగర్ గా భారీ క్రేజ్ సంపాదించుకున్నప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ మూవీ కచ్చితంగా భారీ హిట్ అవుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్గా మరాఠీ బ్యూటీ సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది.
అయితే ఎన్టీఆర్ తన కెరీర్లో చాలామంది దర్శకులని గుడ్డిగా నమ్మేస్తాడు.. అది ఎన్టీఆర్ లో ఉన్న పెద్ద మైనస్ అని జనాలు మాట్లాడుకుంటున్నారు. గతంలో ఎన్టీఆర్ ని నిండా ముంచేసిన పలువురు దర్శకుల పేర్లను ట్రోల్ చేస్తున్నారు. అలా ముంచిన వారిలో మొదటి స్థానంలో సీనియర్ దర్శకుడు బి గోపాల్ పేరు ముందుగా వినిపిస్తుంది. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సినిమా నరసింహుడు ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ప్లాప్ నుంచి బయటపడడానికి ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిందే.
ఆ తర్వాత మెహర్ రమేష్ పేరు గట్టిగా వినిపిస్తుంది. శక్తి సినిమాతో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్‌ను పాతాళానికి తొక్కేశాడు. ఇప్పటికీ శక్తి సినిమా టీవీలో చూసి చీకొట్టే జనాలు ఎంతో మంది ఉన్నారు. ఆ తర్వాత అందరికీ చిరాకు తెప్పించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. దమ్ము సినిమాను ఎన్టీఆర్‌తో తెరకెక్కించి ఆయన ఖాతాలో పరమ చెత్త రికార్డును వేశాడు. ఈ ముగ్గురు ఇచ్చిన ప్లాప్స్ ఎన్టీఆర్ కి లైఫ్ లో మర్చిపోలేని షాక్‌లు ఇచ్చాయి. ఈ విధంగా ఈ ముగ్గురు డైరెక్టర్లు ఎన్టీఆర్‌ను నమ్మించి నిండా ముంచేశారు అంటూ ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు.