Jr NTR: తెరమీద తాము అందించే వినోదానికి అభిమానులుగా మారి.. కుటుంబంతో పాటు తమ అభిమాన హీరో కూడా తమ జీవితాల్లో ఓ భాగం అనుకునే అభిమానులు, వీరాభిమానులు ఎందరో ఉంటారు. వారి అభిమానం మాటల్లో చెప్పలేనిది. అందుకే అభిమానునుద్దేశించి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం అంటుంటారు కథానాయకులు.
తన అభిమాని అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకుని.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అతని తల్లిని ఫోన్లో పరామర్శించి.. ధైర్యం చెప్పిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనార్థన్.. ఎన్టీఆర్‌కి వీరాభిమాని. ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు జనార్థన్. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉందనే విషయం తెలుసుకున్న తారక్.. జనార్థన్ తల్లితో మాట్లాడారు.
‘మీరు అధైర్యపడకుండా దేవుడిని నమ్మండి.. దేవుడి పైన భారం వెయ్యండి.. మేమందరం కూడా ప్రార్థిస్తాం.. త్వరలోనే తను కోలుకుని వస్తాడు’.. అంటూ జనార్థన్ తల్లికి తారక్ ధైర్యం చెప్పారు. ఎన్టీఆర్‌తో మాట్లాడుతూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఫోన్ స్పీకర్ ఆన్ చెయ్యగా.. జనార్థన్‌తో కూడా తారక్ మాట్లాడారు. పలువురు ఎన్టీఆర్ అభిమానులు కూడా తోటి అభిమానిగా జనార్థన్కి తమ వంతు సాయమందించడానికి ముందుకొచ్చారు.
Leave a comment