Kalyan Ram: అన్నగారి లెగసీని ఇప్పుడు కొందరు నందమూరి హీరోలు కంటిన్యూ చేస్తున్న విషయం తెలిసిందే.బాలకృష్ణ, జూనియర్, కళ్యాణ్ రామ్ సినీ ప్రేక్షకులని వైవిధ్యమైన సినిమాలతో అలరిస్తూ వస్తున్నారు. బాలయ్య, జూనియర్ స్టార్ హీరోలుగా ఎదిగిన కళ్యాణ్ రామ్ మాత్రం మీడియం రేంజ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఒకవైపు నటుడిగా, నిర్మాతగా సత్తా చాటుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల `బింబిసార` మూవీతో పెద్ద హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం ఎలాంటి సంచలన లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంత పెద్ద విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో కళ్యాణ్ రామ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ `డెవిల్` చిత్రం చేస్తుండగా, ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్నార. నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తైంది. నవంబర్ లో వి చిత్ర విడుదలకి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా కళ్యాణ్ రామ్‌కి మంచి విజయం అందిస్తుందని చెబుతున్నారు. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. 2006లో స్వాతి అనే అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకోగా, ఇది పెద్దలు కుదిర్చిన సంబంధం. ఈ దంపతులకి శౌర్యరామ్ అనే కుమారుడు, తాత్విక అద్వైత అనే కూతురు ఉన్నారు. ఇప్పుడు వారు సంతోషంగా ఉన్నారు.
అయితే స్వాతి కన్నా ముందుకు కళ్యాణ్ రామ్ ఓ స్టార్ హీరోయిన్ ప్రేమలో ఉన్నాడట. ఆ హీరోయిన్కూడా కళ్యాణ్ రామ్ పై కాస్త ఇంట్రెస్ట్ చూపించిందట. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. కాని కళ్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ ఆ పెళ్లికి ససేమీరా నో చెప్పారట. హీరోయిన్‌తో పెళ్లి వద్దంటూ బ్రెయిన్ వాష్ చేసి స్వాతి అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడట. ఈమె వృత్తిరీత్యా వైద్యురాలు అని తెలుస్తుంది. అయితే ఈ ప్రచారంలో ఎంత నిజం ఉంది.. అసలు ఆ హీరోయిన్ ఎవరు అన్నది మాత్రం క్లారిటీ లేదు.