Keerthy Suresh: సినిమా వాళ్లు రాజకీయాలలోకి వెళ్లడం కొత్తేమి కాదు. హీరో, హీరోయిన్స్ , సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించే వారు కూడా రాజకీయాలోకి వెళ్లి తమ సత్తా చాటుతున్నారు. అయితే ఇప్పుడు మహానటి కీర్తి సురేష్ రాజకీయాలలోకి వెళ్లనుందంటూ వస్తున్న వార్తలు ఒక్కసారిగా అందరిని షాక్‌కి గురి చేశాయి. మహానటి తర్వాత కీర్తి సురేష్ ఇమేజ్ మరింత పెరగగా, ఈ అమ్మడికి లేడి ఓరియెంటెడ్ చిత్రాలకి సంబంధించిన అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. ఆ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా నిరాశపరచడంతో కీర్తి సురేష్ ఇప్పుడు హీరోయిన్‌గాను, స్టార్ హీరోల సోదరి పాత్రలలో మెరుస్తుంది. కీర్తి సురేష్ చివరిగా తెలుగులో దసరా చిత్రంతో పెద్ద హిట్ కొట్టింది.
h
ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ హీరోగా మామన్నన్ అనే సినిమా చేస్తుంది. ఈ చిత్రం జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రస్తుతం మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ని యాంకర్… మీరు రాజకీయాల్లోకి వస్తారా? అని అడగగా, దానికి స్పందిస్తూ రాజకీయాలలోకి రమ్మని కొందరు అడుగుతున్నారు. ఆ నిర్ణయంపై కాస్త ఆలోచించాలి అని ఆమె అన్నారు. చూస్తంటే ఆమె రానున్న రోజులలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం కలదని, ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉందని అర్థం అవుతుంది.
ఆ మధ్య కీర్తి సురేష్.. బీజేపీలో జాయిన్ అయినంటూ పుకార్లు వచ్చాయి. అయితే అవన్నీనిరాధార వార్తలు అంటూ కీర్తి సురేష్ తల్లి మేనకా సురేష్ ఖండించారు. మరి రానున్న రోజులలో అయితే కీర్తి పక్కా రాజకీయాలలోకి వెళ్లనుందని, ఆమె ఏ పార్టీలోకి వెళుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అని అంటున్నారు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్టార్స్ తో జతకడుతూనే , మరోవైపు సిస్టర్స్ రోల్స్ చేయడం కొసమెరుపు. సాధారణంగా చెల్లెలు పాత్రలు చేస్తే హీరోయిన్ గా కెరీర్ ముగుస్తుందని భయపడతారు. కాని కీర్తి సురేష్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. చిరంజీవి హీరోగా రూపొందుతున్న భోళా శంకర్ చిత్రంలో కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలుగా నటిస్తుంది. ఇక ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది.