Keerthy Suresh: మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంది. మహానటి చిత్రంతో దేశ వ్యాప్తంగా అందరి అభిమానాన్ని చూరగొనడమే కాకుండా నేషనల్ అవార్డ్ కూడా దక్కించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత కీర్తి పలు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేసింది. ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఆ రూట్ నుండి పక్కకి వచ్చి హీరోల సరసన నటిస్తుంది. స్టార్ హీరోల సరసన మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటున్న సమయంలో కీర్తి సురేష్ సిస్టర్ పాత్రలకి కూడా సై అనడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే కీర్తి తీసుకున్న నిర్ణయం ఆమెకి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
కీర్తి సురేష్.. 2022లో “అన్నాత్తే (తెలుగులో పెద్దన్న) అనే చిత్రంలో రనజనీకాంత్ సోదరిగా కనిపించింది.ఈ చిత్రం కమర్షియల్గా పరాజయం పాలవడంతో కీర్తి అభిమానులు నిరాశ చెందారు. కీర్తి తీసుకున్న సంచలన నిర్ణయం ఆమెకి ఏ మాత్రం కలిసి రాలేదు. అయితే ఈ సినిమా తర్వాత భోళా శంకర్ చిత్రంలో చిరంజీవికి సోదరిగా నటించారు.ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రెండు చిత్రాలో కీర్తి సురేష్ నటనకి మంచి మార్కులు పడ్డప్పటికీ సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి. తాను సోదరిగా నటించిన రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో మరోసారి ఆ ప్రయోగం చేయదని అందరు అనుకున్నారు.
కాని తమిళ స్టార్ హీరో అజిత్ చిత్రంలో సోదరిగా నటించేందుకు కీర్తి సిద్ధమైంది. దీంతో ఈ సినిమా కూడా ఫ్లాప్ అయినట్టేనని కొందరు జోస్యాలు చెబుతున్నారు. కీర్తి ప్రతిభావంతురాలైన నటి కాగా, సినిమా విజయం కథ, సహాయక తారాగణం, దర్శకత్వం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సినిమా ఫ్లాప్ అనేది ఆమె సోదరిగా నటించడం వలన కాదు. ఆమెను ఐరన్ లెగ్ అని లేబుల్ చేయాల్సిన అవసరం ఏ మాత్రం లేదు అని కొందరు విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.