KGF Hero: సీనియర్ నటి సుమలత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కథానాయికగా నటించి మెప్పించిన ఈమె హోస్ట్‌గా కూడా చేసింది. అయితే తన భర్త అంబరీష్ మరణాంతరం రాజకీయాల్లో అడుగుపెట్టారు సుమలత. ఇక , సోమవారం (జూన్ 5) వారి కుమారుడు అభిషేక్ వివాహం అవీవాతో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన సతీమణి లతతో కలిసి హాజరు కాగా, అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
ఇక పెళ్లి అనంతరం జరిగిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫంక్షన్ లో యశ్ మరియు మరో స్టార్ హీరో దర్శన్ చేసిన సందడి మాములుగా లేదు. మ్యూజికల్ నైట్ లో కొత్త జంటతో కలిసి యశ్ అండ్ దర్శన్ డ్యాన్స్‌లతో రచ్చ చేశారు. ప్రస్తుతం ఆ డ్యాన్స్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. యష్ జోష్ చూసి ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. ఇక ఈ మ్యూజికల్ నైట్ పార్టీకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తో పాటు మాజీ సీఎం యడియూరప్ప, చిరంజీవి దంపతులు, జాకీష్రాఫ్, ఖుష్బూ తదితరులు హాజరయ్యి కొత్త జంటను ఆశ్వీరదించారు. తారలు, రాజకీయ నేతల సందడితో ఫంక్షన్ సందడిగా సాగింది.
ఇక సుమలత విషయానికి వస్తే.. ప్రస్తుతం కర్ణాటకలోని మాండ్య నుంచి ఎంపీగా ఉన్నారు. ఈ మేరకు తన కుమారుడి పెళ్లికి రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించారు. ఆయన దంపతులకు ఆశీస్సులు అందించారు. ఇక సుమలత తన కెరీర్లో చిరంజీవి వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. అలాగే రజనీకాంత్ సరసన కూడా మురట్టు కాళై, అన్బుక్కు నాన్ అడిమై, కాజుగు’ అనే మూడు తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది. సుమలత ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలతో కలిసి నటించడంతో వారితో మంచి అనుబంధం ఏర్పడింది. ఇక సుమలత కొడుకు కూడా ఇప్పటికే ఒక చిత్రంలో నటించగా, త్వరలోనే ఆయన మహేష్ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నట్టు సమాచారం.