‘యువ సామ్రాట్’ అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సంక్రాంతికి తండ్రి ‘కింగ్’ నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన చై నటిస్తున్న.. ‘థ్యాంక్యూ’ జూలై 8న విడుదల కానుంది. బాలీవుడ్ డెబ్యూ ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్టు 11న రిలీజ్‌కి రెడీ అవుతోంది.
తర్వాత పరశురామ్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ కానుంది. ఇటీవలే తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో మూవీ కన్ఫమ్ చేశారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ మీద బ్యానర్ మీద శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
ఈ సినిమాలో చైతన్యకి జోడీగా బ్యూటిఫుల్ యంగ్ యాక్ట్రెస్ కృతి శెట్టి నటించనున్నట్లు అనౌన్స్ చేశారు. #NC22 టీంలోకి ఆమెకి వెల్కమ్ చెప్తూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు మేకర్స్. ‘బంగార్రాజు’ లో చైతన్య, కృతి పెయిర్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళ్లోనూ ఈ మూవీ తెరకెక్కబోతుంది.
ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది టీం.. లెజెండరీ మ్యూజిక్ ‘మ్యాస్ట్రో’, ‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా, ఆయన తనయుడు ‘యంగ్ మ్యాస్ట్రో’ యువన్ శంకర్ రాజా ఇద్దరూ ఈ ఫిలింకి సంగీతమందిస్తుండడం విశేషం. ప్రస్తుతం ట్విట్టర్లో #NC22 #NC22Begins హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
Leave a comment