Kriti Sanon: ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16న విడుదల కాగా, ఈ సినిమా అనేక విమర్శలని మూటగట్టుకుంది. సినిమా విడుదలైనప్పటి నుండి చిత్రంపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలని కూడతా కొందరు నిరసనలు చేస్తున్నారు. ఇక సినీ వర్కర్స్ అసోసియేషన్స్ వాళ్లు అయితే ఏకంగా ఈ సినిమాను నిషేధించాలంటూ ప్రధాని మోదీకి లేఖ కూడా రాసారు. దర్శకుడు ఓం రౌత్.. వాల్మీకి రామాయణం తీసానంటూ చెప్పి.. రామాయణాన్ని పూర్తిగా వక్రీకరించి ఈ సినిమా తీయడంపై రామభక్తులతో పాటు సాధారణ ఆడియన్స్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు రామయాణం నేపథ్యంలో సినిమా తీస్తున్నాం అని చెప్పి ఇప్పుడు మాత్రం రామాయణం నేపథ్యంలో తీయలేదని అంటున్నారు.
రామాయణం నేపథ్యంలో చిత్రం తెరకెక్కనప్పుడు మూవీ ప్రదర్శించే థియేటర్స్‌లో హనుమంతుడికి ఓ సీటు ఎందుకు కేటాయించమని అడిగావు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణుడు అయిన రావణాసురుడిని చిత్రంలో మాంసాహారి గా చూపించడం, రాముడికి మీసాలు పెట్టడం, రావణాసురిడికి 10 తలలను రెండు వరుసలుగా చూపించడం ఇలా పలు సన్నివేశాలు ఆడియన్స్‌ని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. గత కొద్ది రోజులుగా చిత్ర బృందంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కృతి తల్లి గీత సనన్ తనదైన శైలిలో స్పందించారు. గీత సనన్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు స్వచ్ఛమైన మనసుతో ఒక విషయాంపై అధ్యయనం చెయ్యాల్సి ఉంటుంది..
దేనినైన మనం సరైన దృష్టితో చూసినప్పుడే మనకి ప్రపంచం మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది. శ్రీ రాముడు మనకి ప్రేమను పంచమని నేర్పించాడు. శబరి రాముడికి అందించిన ప్రేమని చూడాలి తప్ప, వ్యక్తిలోని తప్పులను అస్సలు చూడకూడదు. ఎదుటి వారి భావోద్వేగాలను గౌరవించడం మంచిది, జై శ్రీ రామ్’ అంటూ ఆమె కృతి సనన్ తల్లి ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఆదిపురుష్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. తొలి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లు, రెండో రోజు 100 కోట్ల రూపాయలు , మూడో రోజు కూడా మరో 100 కోట్లు, నాలుగో రోజు 35 కోట్లు వసూలు చేయడంతో ఈ చిత్రం 375 కోట్ల రూపాయలను రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని ఆదిపురుష్ అందుకుంటుందని పలువురు చెప్పుకొస్తున్నారు.