‘రియల్ స్టార్’ గా పేరు తెచ్చుకున్న శ్రీహరి తన తొలి రోజుల్లో ఒక చిన్న మెకానిక్ షాప్ చూసుకునేవారని, ఆ షాప్ దగ్గరలో ఉన్న థియేటర్ లో సినిమాలు చూడడం వల్ల సినిమాలపై కలిగిన ఆసక్తితో హైదరాబాద్ వచ్చి.. సినిమా అవకాశాల కోసం చూశారని మనం విన్నాం. చదివాం. వెండి తెరమీద తనని తాను గొప్ప నటుడిగా, స్టంట్ మాస్టర్ గా నిరూపించుకున్న శ్రీహరి అసలు ఎలా చనిపోయారు అనేది చాలామందికి అంతుచిక్కని విషయం. ముఖ్యంగా ఆయన ఆరోగ్యం బాగా లేక చనిపోయారు అంటే చాలా మందికి నమ్మటం చాలా కష్టంగా అనిపించింది.
ఎందుకంటే.. శ్రీహరి అప్పటిదాకా మంచి బాడీ బిల్డర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఎంతో ఫిట్నెస్ తో కనిపించే ఆయన ఆరోగ్యం పాడయి చనిపోయారు అనేది ఎవరికీ నమ్మబుద్ధి కాని విషయం. ముందుగా ఇండస్ట్రీలోకి స్టంట్ మాస్టర్ గా వచ్చి.. తర్వాత హీరోగా కూడా ప్రేక్షకులని మెప్పించారు శ్రీహరి. తర్వాత.. వయసు పైబడుతుండటంతో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. శ్రీహరి పాపులర్ డాన్సర్ డిస్కో శాంతిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అబ్బాయిలు. ఒక పాప. కానీ, ఆ పాప నాలుగేళ్ల వయసులోనే చనిపోయింది. తర్వాత శ్రీహరి గారు తన కూతురు పేరు మీద ‘అక్షర ఫౌండేషన్’ మొదలుపెట్టి సామాజిక కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళు. మేడ్చల్ జిల్లాలో నాలుగు ఊర్లని దత్తత తీసుకుని అక్కడి ప్రజల కనీస అవసరాలు తీర్చేవాళ్ళు.
కానీ, శ్రీహరికి ఉన్న అతి పెద్ద హానికర అలవాటు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం. తాగాల్సిన అవసరం ఏమొచ్చేదో తెలీదు కానీ ఆయన చాలా ఎక్కువగా తాగుతూ ఉండేవాళ్ళని టాక్. ఎక్కువగా తాగడం వలన అది ఆరోగ్యంపై చాలా ఎక్కువగా ప్రభావం చూపించింది. ఒకరోజు షూటింగ్ కోసమని ముంబై వెళ్ళిన శ్రీహరికి అక్కడే బాగా జ్వరం వచ్చిందట. అక్కడే హాస్పిటల్ లో చేరిన శ్రీహరిని చూడటానికి ఆయన భార్య కూడా వచ్చి కలిసింది. ఐతే, అప్పటిదాకా బాగానే ఉన్న శ్రీహరి ఒక్కసారిగా unconcious అయిపోయారు. తర్వాత ఆయనతో పాటే ఉన్న మేకప్ మేన్ పరిస్తితి అదుపు తప్పుతుందని గ్రహించి డాక్టర్లని అప్రమత్తం చేశాడు.
కానీ, మెల్లగా శ్రీహరి గారి పని అయిపోతుంది. రక్తం కక్కుకుని ఆయన చివరి శ్వాసతో పోరాడుతున్న టైమ్లో శాంతి డాక్టర్ ల కోసం గట్టిగా అరిచి ఘీ పెట్టింది. ఆశపత్రి సిబ్బంది అలర్ట్ అయ్యి ఆయన్ని మరో పెద్ద హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం చేస్తూ ఉండగానే శ్రీహరి తన తుది శ్వాస విడిచారు. ఎంతో స్ట్రాంగ్ గా కనిపించే శ్రీహరి తన ఆల్కహాల్ అలవాటు వల్ల ప్రాణాలు కోల్పోవడం చాలామందికి బాధని కలిగించింది.
Leave a comment