6 దశాబ్దాల పాటు హిందీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన గొప్ప హీరో దిలీప్ కుమార్ ఈ రోజు చనిపోయారు. చాలాకాలంగా శ్వాసకి సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన ఒక్కసారిగా శ్వాస పీల్చుకోవడం మరీ కష్టమై మృత్యువాత పడ్డారు. చనిపోయే సమయానికి ఆయన వయసు 98.
దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్. 1944 లో మొదటిసారి ఆయన జ్వర్ భాటా అనే సినిమాలో నటించారు. అలా ఆయన జర్నీ దాదాపు ఆరు దశాబ్దాల పాటు కొనసాగింది. దిలీప్ కుమార్ మొత్తంగా 65 సినిమాల్లో నటించారు. ఆయన మూవీస్ లో పలు బిగ్గెస్ట్ హిట్స్ కూడా ఉన్నాయి. 2020 లో ఆయన తనకున్న ఇద్దరు సోదరుల్ని కోల్పోయారు. వాళ్ళిద్దరూ కేవలం 2 వారాల వ్యవధిలో కరోనా మహమ్మారికి బలి అవటం విశేషం. ఈ విషయాన్ని ఆయన పబ్లిక్ కి చెప్పటానికి కూడా ఇష్టపడలేదు.
ఈ సాయంత్రం ఐదు గంటలకి ముంబైలో అంత్యక్రియలు జరపనున్నట్లు తెలుస్తోంది. దిలీప్ కుమార్ మరణం పలువురు ప్రముఖులను కదిలించింది. అమితాబ్ బచ్చన్.. ఈ దుర్వార్తని ఉద్దేశించి.. ఇండియన్ సినిమా.. దిలీప్ కుమార్ ముందు దిలీప్ కుమార్ తర్వాత అని చెప్పుకోవచ్చు అన్నారు. తెలుగు హీరోలైన దగ్గుబాటి వెంటకేశ్, చిరంజీవి కొణిదెల, జూనియర్ ఎన్ టీ ఆర్ తమ సంతాపాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
Leave a comment