God Father: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సెట్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, యాక్ట్రెస్ కమ్ ప్రొడ్యూసర్ ఛార్మీ సందడి చేశారు. బాంబేలో సాంగ్ షూట్ జరుగుతుంది. ‘లైగర్’ టీం షూటింగ్ స్పాట్‌కి వెళ్లి చిరుని కలిసిన పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పూరి జగన్నాథ్ జర్నలిస్ట్ క్యారెక్టర్లో నటిస్తున్నారు. నయనతార కీలకపాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.
బాంబేలో ఓ సాంగ్ కోసం సెట్ వేశారు. చిరుతో పాటు బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఈ పాటలో కాలు కదిపారు. ప్రభు దేవా ఈ సాంగ్‌కి కొరియోగ్రఫీ చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్న ‘గాడ్ ఫాదర్’ దసరాకి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.
Leave a comment