మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ తరుణం రానేవచ్చింది. అభిమానులందరికి అన్నయ్య, స్టార్లకే స్టార్.. మెగాస్టార్ ను పద్మ విభూషణ్ అవార్డ్ వరించింది. మెగాస్టార్‌కు పద్మ విభూషన్ అవార్డ్ ఇస్తున్నట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే కి ఒక రోజు ముందు అంటే జనవరి 25న ఈ పద్మ అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ ఏడాది కూడా పద్మ పురస్కారాలకు ఎంపికైన వారీ పేర్లు ప్రకటించారు. ఇందులో భాగంగా చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డ్ ప్రకటించింది భారత ప్రభుత్వం.
ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు లాంటి హీరోల త్వరాత స్వయంకృషితో ఎదిగిన ఏకైక హీరో చిరంజీవి. ఆయనతో పాటు ఎంతో మంది హీరోలు అయనతో పాటు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు చిరు. ఆకాశమంత ఇమేజ్‌తో మెగాస్టార్‌గా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా నేటి తరం హీరోలకు పోటీ ఇచ్చాడంటే.. మెగాస్టార్ రేంజ్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో భారత ప్రభుత్వం సత్కరించింది. ఈ అవార్డు కంటే ముందే చిరంజీవిని పలు అవార్డులు వరించాయి..ఇక ఆయన తన 40 సంవత్సరాలు సినీ కెరీర్లో ఎన్ని పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు ఇక్కడ చూద్దాం.
చిరంజీవి ‘స్వయంకృషి’కి తొలి అవార్డు:
చిరు నటించిన ‘స్వయంకృషి’ సినిమాకు గాను 1987లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడిగా చిరంజీవి నంది అవిర్డును అందుకున్నారు. ఆయనకు తొలి ప్రభుత్వ పురస్కారం కూడా ఇదే. అంతకు ముందు ‘శుభలేఖ’ (1982), ‘విజేత’ (1985)లో రెండు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి. మొత్తం మీద 9 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌ను చిరు అందుకున్నారు. ‘ఆపద్బాంధవుడు’ సినిమాకు గాను 1992లో మరోసారి, ‘ఇంద్ర’ సినిమాకు గాను 2022లో మరోసారి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు మెగాస్టార్. మొత్తం మీద ఆయన ఖాతాలో మూడు నందులు ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ 2006లో గౌరవ డాక్టరేట్‌ను ఇచ్చి సత్కరించింది… 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది.
పద్మశ్రీ లేదు… నేరుగా పద్మభూషణ్:
మన భారత ప్రభుత్వం నుంచి వచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న.. ఆ తర్వాత పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు ఉంటాయి.. చిత్ర పరిశ్రమలో ఉండే చాలామందికి ముందుగా పద్మశ్రీ అవార్డు వస్తుంది.. ఆ తర్వాత పద్మ భూషణ్‌తో సత్కరించేవారు. అయితే, చిరంజీవికి పద్మశ్రీ రాలేదు. ఆయనను 2006లో పద్మభూషణ్ లభించింది. ఈ ఏడాది పద్మ విభూషణ్ వరించింది. ఆస్కార్ అకాడమీ నుంచి అవార్డుల వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానం అందుకున్న తొలి సౌత్ ఇండియన్ యాక్టర్ చిరంజీవి. మెగాస్టార్ 1987లో 59వ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవానికి హాజరు అయ్యారు.
చిరంజీవికి వచ్చిన అవార్డుల లిస్ట్:
రెండేళ్ల క్రితం.. 2022లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) చిరంజీవిని సన్మానించింది. ప్రయివేట్ సంస్థలు ఇచ్చిన అవార్డులు కోకొల్లలు. చిరంజీవిని కేవలం నటుడిగా మాత్రం ప్రభుత్వాలు చూడలేదు. ఆయన హీరో గానే కాకుండా ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ స్థాపించడం ద్వారా ఆయన చేసిన సేవలను ప్రభుత్వాలు గుర్తించాయి. అందుకు పద్మ భూషణ్ వచ్చింది. కోవిడ్ కాలంలో ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ నెలకొల్పి చిత్ర పరిశ్రమ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇంకా అత్యవసర పరిస్థితులలో ఆక్సీజెన్ లభించక ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఆక్సీజెన్ సిలిండర్లు, అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేశారు. ఇలా చిరు ఒక్క హీరోగానే కాకుండా ఆపదలో ఉన్నవారికి తన వంతు సహాయం చేస్తూ ఎందరికో మార్గదర్శకులుగా నిలిచాడు. ఇప్పుడు ఆయనకు పద్మ విభూషణ్ వరించింది.