NTR Childrens: నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి (Kantamaneni Uma Maheswari) ఆగస్టు 1 ఉదయం కన్నుమూశారు. ఆమె హఠాన్మరణాన్ని నందమూరి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
నాలుగేళ్ల క్రితం నందమూరి హరికృష్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉమా మహేశ్వరి మరణంతో ఇప్పటివరకు ఎన్టీఆర్ సంతానంలో ఎంతమంది కన్నుమూశారు.. ఎంతమంది బతికి ఉన్నారు.. అసలు ఎన్టీఆర్‌కి మొత్తం ఎంతమంది పిల్లలు అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
వివరాళ్లోకి వెళ్తే.. ఎన్టీఆర్-బసవతారకం దంపతులకు మొత్తం 12 మంది సంతానం.. 8 మంది కొడుకులు, 4 కూతుళ్లు.. సీనియర్ రామకృష్ణ చిన్న వయసులోనే మశూచి సోకి మరణించారు. ఆ సమయంలో ఓ సినిమా షూటింగులో ఉన్నారు ఎన్టీఆర్. కుమారుడు మరణంతో ఆయన కొద్ది రోజులపాటు సాధారణ స్థితికి చేరుకోలేకపోయారు.
మరణించిన కుమారుడి మీద ప్రేమతో మరో కుమారుడికి జూనియర్ రామకృష్ణ అని పేరు పెట్టారు. ఐదవ కొడుకు సాయి కృష్ణ 2004లో అనారోగ్యంతో మరణించారు. తండ్రి బతికున్నప్పుడు ఆయన పర్సనల్ విషయాలు చూసుకునేవారు సాయి కృష్ణ. హరికృష్ణ 2018లో యాక్సిడెంట్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిన్న కుమార్తె కూడా మృతి చెందారు.
పెద్ద కుమార్తె గారపాటి లోకేశ్వరి, రెండో కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి, మూడో కుమార్తె నారా భువనేశ్వరి, నాలుగో కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి.. కుమారుల్లో సీనియర్ రామకృష్ణ, సాయి కృష్ణ, హరికృష్ణ మరణించారు. జయకృష్ణ, జయ శంకర కృష్ణ, మోహన కృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ ఉన్నారు.
Leave a comment