దక్షిణాదిలో మాత్రమే కాకుండా సగటున మన దేశంలో నడుస్తున్న రాజకీయాల సంగతి తెలిసిందే. వాటిని సినిమా రూపంలో కళ్ళకు కట్టే ప్రయత్నం చేస్తూ పొలిటికల్ సెటైర్ గా వచ్చిన చిత్రం LKG. తమిళ్ లో వచ్చిన ఈ సినిమా అక్కడ మంచి రెస్పాన్స్ ని సంపాదించింది. Rj బాలాజీ ఇందులో హీరోగా, ప్రియా ఆనంద్ కథానాయిక. తను బాలక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఇప్పుడు తెలుగులోకి కూడా డబ్ చేయడం జరిగింది.
కథ ఇప్పటికే తెలిసిందే అయినా తెలుగు నేటివిటీకి అన్వయిస్తూ చేశారు. ఈ రోజే విడుదలైన ట్రైలర్ ఇదొక పర్ఫెక్ట్ పొలిటికల్ సెటైర్ అని నిరూపిస్తోంది. తమిళ నేపథ్యంలో తీసినప్పటికీ భారతీయ రాజకీయాలను జనరలైజ్ చేస్తూ ఈ కథాంశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ కి ఆన్లైన్ లో మంచి స్పందన కనిపిస్తోంది. ఈ నెల 25 న సినిమాని ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ఆహా లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. బాలాజీ అభిమానులు ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూసారు అప్పట్లో. ఇప్పుడు తెలుగులో కూడా బాలాజీ అభిమానులని సంపాదించుకోవాలి అనుకుంటున్నాడు.
ఆర్జే బాలాజీ స్వయంగా తన స్నేహితులతో కలిసి కథని, స్క్రీన్ ప్లేని రాసుకున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన వ్యక్తి లియాన్ జేమ్స్. విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ చేసాడు. ఎడిటింగ్ – ఆంథోనీ. ఇషారీ కె. గణేష్ ఈ సినిమాని నిర్మించారు. ఇక సినిమా ఆద్యంతం ఎలా ఉండబోతుందో మరిన్ని రోజులు వేచి చూద్దాం.
Leave a comment