ఈ మధ్య మా కి సంబంధించి మంచి రసవత్తరమైన గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఐతే వాళ్ళల్లో వాళ్ళకి అంతలా విభేధాలు రావడానికి పలు కారణాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాళ్ళ మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని అంచనా వేయడానికి సినీ అభిమానులు రకరకాల కోణాలని పరిశీలిస్తున్నారు.
వాటిల్లో ముఖ్యంగా.. మా లో నటుల మధ్య కుటుంబ భేధాలు ఉండటం కూడా ఒక కారణమని తెలుస్తుంది. ఎందుకంటే.. మా కోసం ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత దానికి ఎవరు పేరు పెట్టాలి.. అందులో లోపల రకరకాల సెక్షన్స్ కి ఎవరి పేరు నిర్ణయించాలి అన్న కారణాలతో ఇప్పటిదాకా బిల్డింగ్ ని నిర్మించే విషయంలో అస్సలు ముందుకు వెళ్లలేదు అనేది ఒక అభిప్రాయం.
కానీ.. అదొక్కటే కచ్చితంగా కారణం ఐతే కాదు.. ఇంకా చాలా కారణాలే ఉండవచ్చని కూడా అనుకుంటున్నారు. స్థలం దొరకకపోవడం, ప్రభుత్వం కొంత సమయం వరకు సహకారం అందిస్తున్నట్టే కనిపించి తర్వాత మొహం చాటేయడం చేస్తూ వచ్చింది అన్నమాట. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ బిల్డింగ్ విషయంలో ఎలాంటి మార్పు కూడా చోటు చేసుకోలేదు.
Leave a comment