Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు.. కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీకి ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతున్నట్టు తెలుస్తుంది. సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ చిత్రీకరణ శరవేగంగా జరుపుతున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్ తరహాలో చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన పర్సనల్ లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తాజాగా మహేష్ బాబు ఓ ఖరీదైన కారుని కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇలాంటి కారు హైదరాబాద్‌లో ఎవరికి లేదట. సాధారణంగా స్టార్ హీరోలు ఖరీదైన కార్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. చిరంజీవి, జూ. ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వారు లగ్జరీ కార్లు మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా సరికొత్త డిజైన్ తో కూడిన రేంజ్ రోవర్ కొనుగోలు చేశారు. దీని విలువ రూ.5.4 కోట్ల అని సమాచారం. దీని మోడల్ రేంజ్ రోవర్ ఎస్ వి కాగా, పూర్తిగా గోల్డెన్ కలర్ లో ఉంటుంది. ఇది ఇప్పుడు మహేష్ బాబు గ్యారేజ్‌కి చేరినట్టు సమాచారం.
గోల్డెన్ కలర్ రేంజ్ రోవర్ కారు ని కొనుగోలు చేసిన ఏకైక వ్యక్తి మహేష్ బాబు కాగా, ఈ కారులో ఆయన హైదరాబాద్‌లో చక్కర్లు కొట్టినట్టు తెలుస్తుంది. ఇక మహేష్ ఒకవైపు వెండితెరపై నటిస్తూనే పలు యాడ్స్ లో నటిస్తూ బాగా సంపాదిస్తున్నాడు. మరోవైపు బిజినెస్‌లలో కూడా రాణిస్తున్నాడు.. బాలీవుడ్ భామ నమ్రత శిరోద్కర్ ని ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకోగా, ఈ జంటకి సితార, గౌతమ్ కృష్ణ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి మహేష్ తరచు విహార యాత్రలకు వెళుతూ ఉంటారు. కొద్ది నెలల క్రితం మహేష్ ఫ్యామిలీలో వరుస విషాదాలు చోటు చేసుకోగా, ఆ సమయంలో ఆయన చాలా కుంగిపోయారు.