టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత మహేష్- త్రివిక్రమ్ దగ్గర నుంచి వస్తున్న సినిమా కావటంతో ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరో వారం రోజుల్లో అనగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
మహేష్ కు జంటగా శ్రీలీల- మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ కూడా ప్రేక్షకులకు సినిమాపై అంచనాలను పెంచేసాయి. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా థియాట్రికల్ రైట్స్ దాదాపూ రూ.150 కోట్లకు అమ్ముడుపోయాయి.. ప్రపంచవ్యాప్తంగా థియాట్రికల్ రైట్స్ రూ.155 కోట్లకు క్లోజ్ అయ్యాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని మహేష్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
అంతేకాకుండా ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు మంచి పూనకాలు తప్పించే విధంగా ఉంటుందని మహేష్ మేనరిజం కూడా ఈ సినిమాలో అదిరిపోయిందని ఇప్పటికే టాక్ అయితే ఉంది. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమా రన్ టైం విషయానికి వస్తే రెండు గంటల 42 నిమిషాల నిడివి ఉంటుంది అంటూ తెలుస్తుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు చాలా కాలం తర్వాత మహేష్ బాబు దగ్గర నూంచి పోకిరి తరహాలో ఓ మాస్ సినిమా చూస్తున్నామని అన్నారు.
మహేష్ గత సినిమా సర్కారు వారి పాట మూవీలో కూడా మాస్ పాత్రలో నటించిన.. ఇందులో మాత్రం మాస్ ప్రేక్షకులకు కచ్చితంగా పూనకాలు తప్పించేలా ఉన్నరు. పైగా ఈ సినిమా కథ కూడా ఎవరు ఊహించిన విధంగా ఎంతో కొత్తగా ఉందని.. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అవుతుందని సెన్సార్ సభ్యుల నుంచి టాక్ బయటకు వచ్చింది. ఇక మరి మహేష్ గుంటూరు కారం సినిమాతో సంక్రాంతికి ఎలాంటి రికార్డులను తన ఖాతాలో వేసుకుంటాడు చూడాలి.