సుప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం ఒక గొప్ప కారణంతో జయేంద్ర అనే మరో సీనియర్ దర్శకడితో కలిసి ప్లాన్ చేసిన సిరీస్ ఇది. ఆ కారణం ఏమిటంటే.. కరోనా పాండెమిక్ వల్ల సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఎంతలా దెబ్బతిన్నారో అందరికీ తెలిసిందే. షూటింగ్ లు జరగక వాళ్ళు కడుపునిండా తిండి కూడా తినలేని స్థితిలో గడిపేసారు. ఈ వృత్తి తప్ప మరే వృత్తీ చేయలేని వాళ్ళ నిస్సహాయత ఆ సీనియర్ దర్శకులకి కనిపించింది. వాళ్ళకి ఎలాగైనా సాయపడాలి అనుకున్నారు. అందుకే.. ఈ ప్రాజెక్ట్ తో ముందుకు వచ్చారు.
ముందుగా కథను సిద్ధం చేసుకున్న తర్వాత ఈ విషయాన్ని ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న దర్శకులని, నటీ నటులని సంప్రదించారు. చారిటీ వర్క్ గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో భాగం అవడానికి వాళ్ళంతా ఓకే చెప్తున్నట్లు తెలుస్తుంది. ముందుగా ఆ తొమ్మిది మంది దర్శకులు ఎవరో చూద్దాం. విజయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తీక్ సుబ్బారాజ్, కార్తీక్ నరేన్, కేవీ ఆనంద్, ponram, రతిందరన్ ప్రసాద్, halitha shameem. వీళ్ళు నవసరాలైన శృంగారం, హాస్యం, కరుణ, రౌద్ర, వీర, భయంకర, భీభత్స(అసహ్యం), అద్భుత, శాంతి లలో ఒక్కో రసాన్ని ఒక్కో దర్శకుడు డైరెక్ట్ చేయడం జరిగిందన్నమాట.
అలాగే ఇందులో మరో హైలైట్ ఏంటంటే.. ప్రముఖ నటీ నటులు ఇందులో చాలామందే నటిస్తున్నారు. దాదాపు 40 మంది మనకు బాగా తెలిసిన వాళ్ళు ఇందులో కనిపించబోతున్నారన్న మాట. సూర్య, విజయ్ సేతుపతి, అరవింద స్వామి, సిద్ధార్థ్, ప్రకాష్ రాజ్, సరవనన్, అలగం పెరుమాళ్, రేవతి, నిత్య మీనన్, పార్వతి తిరువోతు, రోహిణి, ఐశ్వర్య రాజేష్, అంజలి వంటి వాళ్ళు అంతా ఇందులో కనిపించబోతున్నారు. వీళ్ళతో పాటు.. ఏ ఆర్ రెహ్మాన్, జీబ్రాన్ వంటి సంగీత దర్శకులు, సంతోష్ సెల్వం, బాలసుబ్రహ్మణ్యం, మనోజ్ పరమహంస వంటి సినిమాటోగ్రాఫర్స్ కూడా ఈ సిరీస్ కోసం పనిచేశారు. ఆగస్ట్ 6 నుండి netflix లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతుంది.
Leave a comment