ఈ సంవత్సరం మన తెలుగులో ఎక్కువగా చర్చించుకున్న విషయం ఏదైన ఉందంటే అది మెగా ఫ్యామిలీ స్టార్ హీరోలైన రామ్‌చరణ్, బన్నీ మధ్య గొడవలు, విబేధాల గురించే. గత కొన్నీ సంవత్సరాలుగా ఇద్దదీ మధ్య అంత సఖ్యత, సానుకూల వాతావరణం ఉన్నట్టు కనిపించలేదు. సోషల్ మీడియాలో ఇతర హీరోల గురించి ఈ ఇద్దరు హీరోలు పెట్టే కామెంట్స్ హత్తుకునేలా ఉంటే వీరిద్దరి గురించి వీళ్లు పెట్టుకునే కామెంట్లు వీరీ మధ్య ఏదో ఉంది, అయిష్టంగా ఉన్నట్టు కూడా ఉన్నటు పలు అనుమానాలకు దారితీసింది.
ఇక త్రిబుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం, ఇటు పుష్ప సినిమాకు జాతీయ అవార్డు రావడం.. ఇక బన్నీకి ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు రావడంతో వీరి మధ్య ఉన్న గ్యాప్ మరింత పెరిగిందన్న ప్రచారం కూడా గట్టిగా వినిపించింది. త్రిబుల్ ఆర్కు ఆస్కారు అవార్డు టైంలో బన్నీ ప్రత్యేకంగా చరణ్‌ను అభినందించలేదు. అదే విధంగా బన్నీకి జాతీయ అవార్డు వచ్చిన సమయంలో చరణ్ ప్రత్యేకంగా అభినందించకుండా గుంపులో కలిపేస్తూ ఓ ట్వీట్ వేశాడు అన్నీ బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో గోల చేశారు.
అలా చరణ్, బన్నీ మధ్య గ్యాప్‌పై అప్పట్లో ఎంతో ప్రచారం నడిచింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి కనిపించింది ఎక్కడ లేదు..! ఇక మెగా కుటుంబ ఫంక్షన్లలోనూ కూడా ఈ ఇద్దరు కలిసి కనిపించేవారు కాదు. వరుణ్ తేజ్ పెళ్లిలో ఇద్దరూ వచ్చినా కూడా ఎక్కడా ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్‌లో లేరు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు చరణ్, బన్నీ కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. తాజాగా మెగా ఫ్యామిలీ అంతా కలిసి క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు.
ఇక ఈ వేడుకల్లో దిగిన గ్రూప్ ఫోటోలో బన్నీ, చరణ్ కలిసి ఒకే ప్రేమ్‌లో కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పోయిందా? అని కొందరు అంటున్నా… వృత్తిపరమైన పోటీతో పాటు కెరీర్ పరంగా ఆధిపత్యం కోసం మొదలైన ఈ వార్‌కు ఇప్పట్లో ఫుల్స్టాప్ ఉండాదని. ఇలా ఇద్దరి మధ్య ఉన్నా వార్ మెగా కుటుంబంలో ఎలాంటి మంటాల్లు రేపుతుందో చూడాలి.