రామ్ చరణ్- ఉపాసనల పెళ్లి పీఠలు ఎక్కడానికీ ఓ సినిమా స్టోరీ కున్నంత తతంగమే నడిచింది. ఇటీవల వీళ్లిద్దరు 11వ వివాహా వార్షికోత్సవం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ రోజు ఆషాఢ మాసం శుక్ల విదియ మంచి రోజు కావడంతో ఈ డేట్‌కు డాక్లర్ల సలహా మేరకు తమ కొత్త బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నెట్టింట మెగా ప్రిన్సెస్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. ఇక తన ఇంట వారసురాలు అడుగుపెట్టడంతో చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ‘లిటిల్ మెగా పిన్సెస్ నీకు స్వాగతం. నీ రాకతో మెగా ఫ్యామిలీ తో పాటు అభిమానులలో ఆనందం వెదజల్లావు. రామ్ చరణ్, ఉపాసనకు ఎల్లప్పుడు అందరీ దీవెనలు ఉంటాయి. తాతగా నాకు చాలా ఆనందంగా ఉంది. గర్విస్తున్నాను.’ అంటూ చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
అయితే ఉపాసన నిన్న రాత్రి తన భర్త రామ్ చరణ్, అత్త సురేఖతో కలిసి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈరోజు ఉదయం డెలివరీ చేశారు. పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చిందని ఈ రోజు ప్రకటన ద్వారా ఆస్పత్రి బృందం వెల్లడించింది. ఈ శుభవార్త తెలియగానే మెగా ఫ్యామిలీ ఆనందం అంతా ఇంతా కాదు. ఇక రామ్ చరణ్ గత కొద్ది రోజులుగా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి తన సతీమణిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు.