Home Film News Bhola Shankar: మెగాస్టార్ ‘భోళా శంకర్’ మూవీ రివ్యూ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్
Film News

Bhola Shankar: మెగాస్టార్ ‘భోళా శంకర్’ మూవీ రివ్యూ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కిన మూవీ భోళా శంకర్. చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా నటించ‌గా, కీర్తిసురేష్ చిరు చెల్లెలిగా కనిపించింది. రిలీజ్ కు ముందే భోళా శంకర్ సినిమా మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవ‌డంతో మూవీపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి .  ఈ మూవీ ఈరోజు గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

స్టోరీ:
చిరంజీవి, కీర్తి సురేష్ లు అన్నా చెల్లెళ్లు. వీరు కోల్ కతాలో నివసిస్తూ ఉంటారు. ఇక అమ్మాయిలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ అందరినీ ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ క్రమంలో తమన్నా బ్రదర్ సుశాంత్ తో కీర్తి సురేష్ లవ్ లో పడుతుంది. ఇలా ఓవైపు ఫ్యామిలీ ఎంటర్టైనర్ మరోవైపు గ్యాంగ్ ఆట కట్టించే పనిలో చిరంజీవి ఎలా సక్సెస్ అయ్యారు. కీర్తి సురేష్ కు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ నుండి ఎలాంటి ప్రమాదం ఉందనేది కథ.

తమిళ రీమేక్ స్టోరీ:
భోళా శంకర్ కథ తమిళంలో వచ్చిన అజిత్ యాక్ట్ చేసిన వేదాళం మూవీకి రీమేక్. తెలుగు నేటివిటీకి.. చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్లుగా తెరకెక్కించారు. ఎప్పటిలాగే చిరు లైఫ్ లో రెండు కోణాలు అన్నట్లు గా చూపించారు. ఒకటి ఫ్లాష్ బ్యాక్. మరొకటి రియాలిటీ. చెల్లెలు సెంటిమెంట్ లో చిరు ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు. అయితే బ్యాగ్రౌండ్ తో వచ్చే మ్యూజిక్ తో ‘బోళా శంకర్’లో సెంటిమెంట్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఓ వైపు సెంటిమెంట్ గా కనిపిస్తూనే మరోవైపు రౌడియిజంపై ఫైట్ చేస్తాడు. కీర్తి సురేష్ సుశాంత్ తో ప్రేమలో పడిన తరువాత అసలు స్టోరీ మొదలవుతుంది. ఫస్టాప్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో సాగి.. సెకండాఫ్ సీరియస్ గా కొనసాగుతుంది.

నటీనటులు:
మెగాస్టార్ యాక్టింగ్ తో తన హవా మరోసారి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశారు. టూ డిఫరెంట్ షేడ్స్ లో చిరంజీవి యాక్టింగ్ అదుర్స్ అని చెప్పొచ్చు. ఫైట్స్ సీన్స్ అయితే ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో ఎంటర్ టైన్ చేశారు. సుశాంత్ రోల్ కూడా బావుంది. కీర్తి సురేష్ చెల్లెలుగా శ్రీముఖి అలరించింది. తమన్నాకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా.. తన గ్లామర్ తో ఆకట్టుకుంది.

టెక్నికల్ టీమ్:
డైరెక్టర్ మెహర్ రమేష్ టేకింగ్ బావుంది. చిరు అభిమానులకు ఏం కావాలో అవి చక్కగా ప్రజంట్ చేశారు. బట్ కొన్ని రొటీన్ సీన్స్ అయితే కంటిన్యూ అయ్యాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బావున్నాయి. ఈ సినిమాకి మరో హైలెట్ అంటే అది మ్యూజిక్ అని చెప్పొచ్చు. సాంగ్స్ కూడా పర్లేదనిపించాయి. ఇక ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి.

ప్లస్ పాయింట్స్:
మెగాస్టార్ యాక్టింగ్
మ్యూజిక్
డైరెక్షన్
యాక్షన్ సీక్వెన్స్

మైనస్ పాయింట్స్:
సిస్టర్ సెంటిమెంట్ రొటీన్ సీన్స్
ల్యాగ్ సీన్స్

ఫైనల్ గా భోళాశంకర్ మూవీతో మెగా అభిమానులకు మంచి ఫీస్ట్ అందించిన మూవీ. మెగా ఫ్యాన్స్‌కి మాత్రం చిత్రం ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...