తెలుగు చిత్ర పరిశ్రమలో కలక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా నిర్మాతగా సూపర్ ఫామ్ లో ఉన్న సమయంలో హీరోగా నిర్మాతగా ఆయన చేసిన సినిమా అసెంబ్లీ రౌడీ.. తెలుగులో యాక్షన్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు చంద్రముఖి సినిమాని తెర్కెక్కించిన పి. వాసు తెలుగులో అసెంబ్లీ రౌడీ సినిమాకు కథ అందించారు. అదేవిధంగా పరుచూరి బ్రదర్స్ మాటలు అందించిన ఈ సినిమాకి కె.వి.మహదేవన్ సంగీతం అందించారు.
ఈ సినిమా షూటింగ్ కూడా రాయలసీమ జిల్లాలోని చిత్తూరులో పలు ప్రాంతాల్లో షూట్ చేశారు.. అదేవిధంగా మోహన్ బాబు సొంత ఊరైన ఏర్పేడులో కూడా ఈ సినిమా షూటింగ్ చాలా వరకు జరిగింది. ఈ సినిమాలోని అందమైన వెన్నెలలోన పాటకు మోహన్ బాబు చాలా వరకు ఖర్చు చేశారు. ఈ సినిమాకు వచ్చిన కలక్షన్ లను చూసి అప్పటి ఇండస్ట్రీ పెద్దలు కూడా షాక్ అయ్యారు. ఇక దీంతో ఈ సినిమా దగ్గరనుంచి మోహన్ బాబుకు కలక్షన్ కింగి అనే బిరుదు కూడా వచ్చింది. అదేవిధంగా ఈ సినిమాకి హీరోయిన్ దివ్యభారతి బాగా ప్లస్ అయిందని చెప్పాలి.
ఈ సినిమా హిట్ అయిన తర్వాత తెలుగులో ఈమెతో సినిమాలు తీసేందుకు అప్పటి స్టార్ హీరోలు అగ్ర నిర్మాతలు ఆమె వెంట పడ్డారు. ఈ సినిమా వచ్చిన తర్వాత సంవత్సరంలోనే మళ్లీ మోహన్ బాబు దివ్యభారతి కాంబినేషన్లో చిట్టమ్మ మొగుడు అనే సినిమాా కూడా వచ్చింది. ఈ సినిమా కూడా తమిళ్ తమిళ రీమేక్ .. ఈ సినిమా కథ మీద నమ్మకం లేకపోవడంతో మోహన్ బాబు ఈ సినిమాకు నిర్మాతగా చేయలేదు. అయితే ఈ సినిమాను అప్పటి నిర్మాత పి. శ్రీధర్ రెడ్డి నిర్మించారు. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే అసెంబ్లీ రౌడి సినిమాకు పనిచేసిన వారు అందరూ ఈ సినిమాకి కూడా పనిచేశారు ఒక్క నిర్మాత మాత్రమే చేంజ్ అయ్యారు.
అయితే అసెంబ్లీ రౌడీ సినిమాలో దివ్యభారతిని తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో చిట్టమ్మ మొగుడు లో చాలా వ్యతిరేకించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా దివ్యభారతి బాగా నటించినా ప్రేక్షకులు మాత్రం చూడలేకపోయారు. అప్పట్లో ఈ మూవీని మోహన్ బాబు కేవలం దివ్య భారతి కోసమే చిట్టమ్మ మొగుడును తీసీ నిర్మాతకి నష్టాలు రావడానికి కారణమయ్యారనే టాక్ కూడా టాలీవుడ్లో బాగా నడిచింది. దారుణమైన డిజాస్టర్ ని మూటగట్టుకున్న నిర్మాత అప్పటివరకు సంపాదించిన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారట. దీంతో దివ్యభారతి కోసం మోహన్ బాబు ఆ నిర్మాతను ముంచేశాడనే టాక్ అప్పట్లో వినిపించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌లతో ఒక్కో సినిమా చేసిన దివ్య భారతి కేవలం ఒక్క మోహన్ బాబుతో మాత్రం రెండు సినిమాలు చేసిన రికార్డు దక్కించుకుంది.