అన్ని సంఘాల లాగే ఈ సంఘం ఏర్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తూ.. నటులుగా, నటీమణులుగా, ఇంకా రకరకాల ఆర్టిస్ట్ లుగా పనిచేసే వాళ్ళ కష్ట నష్టాల గురించి మాట్లాడటానికి, చిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందడానికి కృషి చేయడానికి ఈ సంఘం ఏర్పడింది. ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖులు దీనిని అధ్యక్షత వహించి పని చేశారు. మరి కొంతకాలంలో ‘మా’ ఎన్నికలు మళ్ళీ జరగబోతున్న నేపథ్యంలో ఒకసారి ఆ సంస్థకి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం.
మొట్టమొదటి సారి అక్కినేని నాగేశ్వర రావు గారి చేతుల మీదుగా ఈ అసోసియేషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరయ్యారు. ప్రతి రెండు సంవత్సరాలకొకసారి అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మురళి మోహన్ ప్రెసిడెంట్ గా పనిచేసిన దిగిపోయిన తర్వాత ఆయన స్థానంలో రాజేంద్రప్రసాద్ మా ప్రెసిడెంట్ గా పనిచేసారు. తర్వాత శివాజీ రాజా ప్రెసిడెంట్ గా చేశారు. ఆయన తర్వాత నరేష్ ప్రెసిడెంట్ గా గెలిచి సేవలందించారు.
వివాదాల పర్వం : ప్రతిసారి ప్రెసిడెంట్ ఎవరు అవ్వాలనే విషయం మీద గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ సభ్యత్వం తీసుకున్న వాళ్ళే గ్రూపులుగా విడిపోయి.. ప్యానల్స్ గా మారి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా చివరి రెండు టెర్మ్స్ చాలా వివాదాస్పదంగా మారిపోయాయి.
2021 కి గాను ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీలో కొన్ని కీలక మార్పులు తీసుకురావాలని మరి కొన్ని నెలల్లో మొదలవబోతున్న ఎలక్షన్లలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. ఆయనకు చిరంజీవి మద్దతు ఉండటంతో కచ్చితంగా ఆయనే గెలుస్తారు అన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది.
ఇతర సినీ పరిశ్రమలతో పోల్చుకుంటే.. చాలా విషయాలలో తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దదని అలాంటి ‘మా’ కి స్వంత బిల్డింగ్ లేకపోవడం కరెక్ట్ కాదని.. ఇంతకు ముందు పనిచేసిన వాళ్ళెవరూ ఆ పని చేయలేకపోయారని, ఈ సారి తను కచ్చితంగా మా కి స్వంత బిల్డింగ్ కట్టిస్తానని అంటున్నారు.
Leave a comment