ఈ మధ్యనే నారప్ప సినిమాతో వెంకటేష్ ప్రేక్షకులని అలరించిన సంగతి తెలిసిందే. కానీ వెంకటేష్ కి రీమేక్ చేయడం ఇదేమీ కొత్త కాదు. ఇప్పటికే చాలా సినిమాలు ఆయన రీమేక్ చేసినవే. ఐతే, రీమేక్ సినిమాలు ఎందుకు వస్తాయి.. ఒక సినిమాని రీమేక్ చేయాలి అంటే ముందుగా ఆ మూవీ ఖచ్చితంగా ఒక పెద్ద హిట్ అయి ఉండాలి. అప్పుడు ఆ సినిమాని రీమేక్ చేయడం ద్వారా.. వేరొక భాషలో కూడా సక్సెస్ చూసే అవకాశం ఉంటుంది. కానీ, ఒరిజినల్ సినిమాకి వచ్చినంత గుర్తింపు ఇలా రీమేక్ చేసినవాటికి రాకపోవటం చూస్తూ ఉంటాం.
కానీ, వెంకటేష్ ఇది నిజం కాదని చాలా సందర్భాల్లోనే నిరూపించుకున్నాడు. నిజానికి కొన్ని సినిమాలకైతే ఒరిజినల్ కన్నా బాగా చేశాడన్న గుర్తింపు కూడా ఆయనకి వచ్చింది. అందుకే రీమేక్ సినిమాలు చేయడాన్ని పెద్ద ఛాలెంజ్ గా తీసుకుంటూ ఉంటాడు వెంకటేష్. ఇప్పటిదాకా ఆయన చేసిన రీమేక్ మూవీస్ ని ఒకసారి పరిశీలించి చూద్దాం.
1989 లో వచ్చిన ధృవ నక్షత్రం మూవీ మలయాళ మూవీ ఐన ఆర్యన్ కి రీమేక్. అంతకు ముందు సంవత్సరం వచ్చిన వారసుడొచ్చాడు సినిమా తీర్ధ కనలై సినిమాకి రీమేక్. టూటౌన్ రౌడీ మూవీ హిందీలో తీసిన తేజాబ్ కి రీమేక్. అదే హిందీలో వచ్చిన అంకెన్ మూవీని పోకిరి రాజాగా మార్చారు. సూర్యవంశం ఎంత పెద్ద హిట్టో మనకి బాగా తెలుసు. ఈ మూవీ తమిళ్ మూవీ కి రీమేక్. ఆ మూవీ కూడా ఇదే పేరుతో విడదలైంది. ఇలా ఓకే పేరుతో తమిళ్ లో రిలీజ్ ఐన జెమినిని తెలుగులో రీమేక్ చేసినా అడిక్కడ ఫ్లాప్ అయి కూర్చుంది.
అన్నామలై అనే తమిళ సినిమాని తెలుగులో కొండపల్లి రాజాగా రీమేక్ చేశారు వెంకటేష్. ఎంగ చిన్న రాజా అనే మూవీ రీమేక్ అబ్బాయి గారు. తమిళ్ లో సూర్య నటించిన కాకా కాకా సినిమాని వెంకటేష్ ఘర్షణగా చేశారు. అది పెద్ద హిట్. అలాగే ఒక ఇంగ్షీషు సినిమాని కూడా రీమేక్ చేశారు. ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ అనే మూవీని ముద్దుల ప్రియుడుగా తీసుకువచ్చారు. కె. రాఘవేంద్రరావ్ గారు. ఇలా వెంకటేష్ ఎన్నో రీమేక్ సినిమాలతో విక్టరీ సాధించారు అన్నమాట.
Leave a comment