YCP: ప్రస్తుతం ఏపీలో రాజకీయం ఎంత హాట్ హాట్‌గా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అధికారిక ప్రభుత్వం తమపై ఎవరు ఒక్కమాట అన్నా కూడా వెంటనే రియాక్ట్ అవుతున్నారు.రీసెంట్గా టాలీవుడ్ రచయిత అనంత శ్రీరామ్‌కి వైసీపీ శ్రేణులు గట్టి వార్నింగ్ ఇచ్చాయి. అందుకు కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ట్రోలింగ్ చేసిన పొలిటికల్ మిస్సైల్ పేజీ వెనుక ఈ రచయిత ఉన్నాడనే అనుమానం వారికి రావడమే . వైఎస్ఆర్ని విమర్శిస్తూ.. తెల్లని పంచె-మలినమైన మనసు మహానేత అంటూ కొన్ని ట్వీట్లు సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో అది వైఎస్సార్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఈ పేజీని నిర్వహిస్తున్నది అనంత శ్రీరామ్ అని అతనిని దారుణంగా ట్రోల్ చేశారు. ఈ క్రమంలో ఆయన స్పందించారు.
ఓ వీడియో రిలీజ్ చేసిన అనంత శ్రీరామ్.. వైఎస్ పై విమర్శలు, పోస్టులతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నేను వృత్తి రీత్యా అన్ని పార్టీలకు తాను పాటలు రాస్తుంటాను తప్ప ఎవరిని విమర్శించలేదు. భవిష్యత్తులో రాజకీయాలపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తపర్చాల్సి వచ్చినా నిర్భయంగా తన అధికారిక సోషల్ మీడియా వేదికలపైనే ప్రకటిస్తాను తప్ప ఇతర అకౌంట్స్ లో తెలియజేయను. ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నాను. అక్కడి నుండి వచ్చాక ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేస్తానని అన్నాడు. అనంత శ్రీరామ్ క్లారిటీతో ఈ వివాదానికి తెరపడింది.
ఇక జబర్ధస్త్ కామెడీ షోకి సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల కాగా, అందులో బుల్లెట్ భాస్కర్ చెప్పిన పంచ్ డైలాగులు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా ఉన్నాయని, అవి వెంటనే తొలగించాలంటూ వైసీపీ శ్రేణులు బుల్లెట్ భాస్కర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీలో కొనసాగుతున్న వృద్ధ్యాప్య పెన్షన్ ను ఉద్దేశించి ప్రోమాలో డైలాగ్స్ ఉన్నాయని అతనిని నెట్టింట భారీగా ట్రోల్ చేసారు. ఈ క్రమంలో బుల్లెట్ భాస్కర్ క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. వైసీపీ శ్రేణులు, కార్యకర్తలందరికీ మా అమ్మ తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను. అది ఫ్లోలో అన్నదే తప్ప. ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చెప్పింది కాదు అని అన్నారు. ప్రోమోలో డైలాగులు డిలీల్ చేయమని ఇప్పటికే మా టీం వాళ్లకు కూడా చెప్పాను. కాబట్టి ఎపిసోడ్లో కూడా ఆ డైలాగులు అయితే ఉండవు. థ్యాంక్యూ. థ్యాంక్యూ సో మచ్’ అని ఈ వివాదానికి ముగింపు పలికేలా చేశాడు.