Naga Chaitanya: ‘యువ సామ్రాట్’ నాగ చైతన్య జెట్ స్పీడ్‌తో సినిమాలు చేస్తున్నాడు. ఒక దాని తర్వాత ఒకటి వరుస సినిమాలు లైనప్ చేస్తూనే.. ‘దూత’ అనే క్రేజీ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు. జూలై 8న ‘థ్యాంక్యూ’, ఆగస్టు 11న బాలీవుడ్ డెబ్యూ ‘లాల్ సింగ్ చద్దా’ తో అక్కినేని అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు చై.
చైతుని ఆమిర్ ఖాన్ హిందీ ఇండస్ట్రీకి తీసుకెళ్తే.. తమిళ్‌తో పాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభుని చైతు తెలుగు పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ మీద బ్యానర్ మీద శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి లెజెండరీ మ్యూజిక్ ‘మ్యాస్ట్రో’, ‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా, ఆయన తనయుడు ‘యంగ్ మ్యాస్ట్రో’ యువన్ శంకర్ రాజా ఇద్దరూ సంగీతమందిస్తుండడం విశేషం.
గురువారం పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. నాగ చైతన్య, కృతి శెట్టిల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లాప్ నిచ్చారు.
హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తమిళ్ వెర్షన్‌కి ప్రముఖ దర్శకులు భారతీ రాజా క్లాప్ నివ్వగా, యంగ్ హీరో శివ కార్తికేయన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. యువన్ శంకర్ రాజా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో #NC22 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
Leave a comment