మన తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఎలాంటి ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిందే..నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, కింగ్ నాగార్జున కొడుకుగా తెలుగులో హీరోగా అడుగు పెట్టిన నాగచైతన్య.. కెరీర్ ఆరంభంలోనే విజయాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆ తర్వాత ఎలాగో అరాకొరా విజయాలతో ముందుకు వెళ్లాడు. ఇలా నెమ్మదిగా సాగుతున్న తన సినీ లైఫ్ లో పెళ్లి చేసుకుని తన పాపులారిటీని మరింత పెంచుకున్నాడు. తర్వాత మళ్ళీ భార్యకు విడాకులు ఇచ్చి ఉన్న పాపులారిటీనీ పోగొట్టుకునేలా చేసుకున్నాడు.
విడాకులు తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ సరిగ్గా అందుకోలేకపోయాడు. ఇక రీసెంట్ గా వచ్చిన”దూత” వెబ్ సిరీస్ ఆయనకు మంచి కం బ్యాక్ ఇచ్చింది. ఈ ఉపులో మరో మంచి సినిమాతో హిట్ అందుకోవాలంటూ ట్రై చేస్తున్నాడు నాగచైతన్య. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న “తండేల్” సినిమా కోసం ఈ అక్కినేని హీరో చాలా కష్టపడుతున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా కోసం నాగచైతన్య ఇప్పటివరకు ఏ సినిమా మాకు చెయ్యని స్పెషల్ స్టెంట్స్ కూడా నేర్చుకుంటున్నాడు.
రీసెంట్గా ఈ సినిమా హిట్ కోసం నాగచైతన్య పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నాడు. అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇదే వార్త నెట్టింట వైరల్ గా మారింది.. గతంలో సమంతతో కలిసి ఉన్నప్పుడు నాగచైతన్య – సమంత తమ సినిమాల విషయంలో ఇలాగే ప్రత్యేక పూజలు చేసుకునే వారట. ఇప్పుడు సమంతతో విడిపోయిన సరే సమంత సలహానే పాటిస్తున్నాడు నాగచైతన్య అంటూ సమంత ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తున్నారు. ఇక తన మాజీ భార్య సలహ అయన చైతన్యకు కలిసి వస్తుందో లేదో చూడాలి.